‘సి’విజిలేస్తున్నారు! | Sakshi
Sakshi News home page

‘సి’విజిలేస్తున్నారు!

Published Tue, Nov 21 2023 4:42 AM

-

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎన్నికల కమిషన్‌ అందుబాటులోకి తీసుకొచ్చిన సి–విజిల్‌ యాప్‌ సామాన్యుల చేతిలో బ్రహ్మాస్త్రంలా మారింది. అడ్డదారుల్లో ఎన్నికల్లో గెలుపొందేందుకు అభ్యర్థులు చేస్తున్న ప్రయత్నాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. ప్రశాంతమైన వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ భావించింది. ఆ మేరకు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు సి–విజిల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడే వారి వివరాలతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన బ్యానర్లు, పోస్టర్లు, నిర్దేశిత సమయం తర్వాత చేస్తున్న ప్రచారాలు, మద్యం, పంపిణీకి సంబంధించిన ఫిర్యాదుల వీడియోలను సామాన్యులు తమ స్మార్ట్‌ ఫోన్ల ద్వారా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారులతో పాటు పోలీస్‌, ఎకై ్సజ్‌, ఐటీశాఖల అధికారులు వెంటనే ఆ ఘటనా స్థలానికి చేరుకుని అక్రమార్కులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తు న్నారు. జిల్లాలో సోమవారం నాటికి 372 ఫిర్యాదులు ఈ సి–విజిల్‌ యాప్‌ ద్వారా రాగా వీటిలో 208 ఫిర్యాదులను పక్కాగా గుర్తించారు. వీటిలో రెండు కేసులు మినహా మిగిలిన 98 శాతం ఫిర్యాదులను అక్కడిక్కడే పరిష్కరించారు.

Advertisement
Advertisement