విదేశీ చదువులపై ఓయూలో అవగాహన సదస్సు | Sakshi
Sakshi News home page

విదేశీ చదువులపై ఓయూలో అవగాహన సదస్సు

Published Tue, Nov 21 2023 4:42 AM

-

ఉస్మానియా యూనివర్సిటీ: విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఓయూలో ఈ నెల 23న అవగాహన సదస్సును నిర్వహించనున్నారు. గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ కేరీర్‌ ఫోరమ్‌ (జీఈసీఎఫ్‌), ఓయూ హ్యూమ న్‌ కాపిటల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ (హెచ్‌సీడీసీ) సంయుక్త ఆధ్వర్యంలో క్యాంపస్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ అసెంబ్లీ హాలులో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సదస్సు జరుగుతుందని ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ శ్రీరామ్‌ వెంకటేష్‌ తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్య మండలి ఛైర్మన్‌, జీఈసీఎఫ్‌ తెలంగాణ శాఖ ఛైర్మన్‌ ప్రొ.లింబాద్రి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్లు చెప్పారు. విదేశాల్లో అడ్మిషన్స్‌, స్కాలర్‌షిప్స్‌– రుణాలు తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.

ఉచిత శిక్షణ

తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలోని 36 విశ్వవిద్యాలయాలకు చెందిన 500 మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులను ఎంపిక చేసి అమెరికా, యూకే, కెనడ, ఐర్లాండ్‌, అస్ట్రేలియా, ఫ్రాన్స్‌ తదితర దేశాలలో చదివేందుకు ఐఎల్‌టీఎస్‌, జీఆర్‌ఈ, టోఫెల్‌ అర్హత పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వివరాలకు 9150050359, 9384825972 నెంబర్లకు ఫోన్‌ చేయవచ్చు.

Advertisement
Advertisement