బాలాజీ అపార్ట్‌మెంట్‌ పునర్నిర్మించుకోవచ్చు | Sakshi
Sakshi News home page

బాలాజీ అపార్ట్‌మెంట్‌ పునర్నిర్మించుకోవచ్చు

Published Wed, Nov 22 2023 4:34 AM

-

నాంపల్లి : బజార్‌ఘాట్‌లో అగ్ని ప్రమాదానికి గురైన బాలాజీ అపార్ట్‌మెంట్‌ పాక్షికంగా దెబ్బతిన్నదని, దీనిని పునర్నిర్మించుకోవచ్చని జేఎన్టీయూ నిపుణుల బృందం తేల్చిచెప్పింది. అయితే నిర్మాణం పూర్తయ్యాక తాము ఇచ్చే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తదుపరి పరిశీలనలో తాము ఇచ్చే సర్టిఫికెట్‌తోనే భవనంలోనికి ప్రవేశం ఉంటుందా లేదా అనే అంశంపై ఆధారపడి ఉంటుందని నివేదికలో పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం జేఎన్టీయూ నిపుణుల బృందం తమ నివేదికను షీల్డ్‌ కవరులో సమర్పించింది. జేఎన్టీయూ సమర్పించిన నివేదిక ఆధారంగా బుధవారం జీహెచ్‌ఎంసీ అధికారులు నాంపల్లి పోలీసులు నోటీసులను అందజేస్తారు. అపార్ట్‌మెంట్‌ యజమాని రిమాండ్‌లో ఉన్నందున ఈ నోటీసులను యజమానికి బదులుగా పోలీసులకు సమర్పిస్తారు. నాలుగంతస్తుల భవనంలో ముందు వైపున ఉండే పిల్లర్లు పూర్తిగా దెబ్బతిన్నట్లుగా నివేదికలో జేఎన్టీయూ నిపుణుల బృందం వెల్లడించినట్లు తెలిసింది.

Advertisement
Advertisement