ఓవర్‌ టు స్ట్రాంగ్‌ రూమ్స్‌ | Sakshi
Sakshi News home page

ఓవర్‌ టు స్ట్రాంగ్‌ రూమ్స్‌

Published Fri, Dec 1 2023 7:20 AM

-

సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల్లో తుది ఘట్టమైన కౌంటింగ్‌కు రెండు రోజుల గడువు ఉండటంతో పోలీసు బందోబస్తు డ్యూటీ స్ట్రాంగ్‌ రూమ్స్‌ వద్దకు మారింది. ఈవీఎం మిషన్లను గురువారం రాత్రికి వీటిల్లోకి తరలించి భద్రపరిచారు. నగర పరిధిలోని 15 చోట్ల స్ట్రాంగ్‌ రూమ్స్‌/కౌంటింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. దీంతో ఆదివారం కౌంటింగ్‌ సైతం ఇక్కడే జరగనుంది. పోలింగ్‌ నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన లేకుండా చర్యలు తీసుకున్న పోలీసులు స్ట్రాంగ్‌ రూమ్స్‌ వద్దా ఇలాంటి ఏర్పాట్లే చేస్తున్నారు. ప్రధానంగా మూడంచెల భద్రత కల్పించడంతో పాటు కొన్ని అదనపు చర్యలూ తీసుకుంటున్నారు. వీటిని నగర కొత్వాల్‌ సందీప్‌ శాండిల్య స్వయంగా పర్యవేక్షించారు.

స్ట్రాంగ్‌ రూమ్స్‌ భద్రతా ఏర్పాట్లిలా...

● స్ట్రాంగ్‌ రూమ్‌లకు కేవలం ఒకే ద్వారం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. రూమ్‌కు డబుల్‌ లాక్‌ సిస్టం ఏర్పాటు చేసి ఒకటి దాని ఇన్‌చార్జ్‌ వద్ద, మరోటి మేజిస్టీరియల్‌ అధికారాలున్న అధికారి వద్ద ఉంచారు.

● స్ట్రాంగ్‌ రూమ్స్‌ వద్ద 24 గంటలూ సాయుధ గార్డును ఉంచడంతో పాటు అనునిత్యం సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు.

● స్ట్రాంగ్‌ రూమ్స్‌కు ఉండే మూడంచెల భద్రతలో తొలి అంచెలో (రూమ్‌ డోర్‌ దగ్గర) కేంద్ర సాయుధ బలగాలకు చెందిన వారు ఉంటున్నారు. దీనికోసం కనీసం ఒక సెక్షన్‌ (13 మంది) బలగాలు 24 గంటలూ అందుబాటులో ఉండేందుకు ఓ ప్లటూన్‌ (39 మంది) ప్రత్యేకంగా కేటాయించారు.

● రెండో అంచెలో రాష్ట్ర సాయుధ పోలీసులు, మూడో అంచెలో సాధారణ పోలీసు సాయుధ బలగాలను మోహరించారు.

● స్ట్రాంగ్‌ రూమ్స్‌ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఐసీసీసీలోని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు (సీసీసీ) అనుసంధానించారు. అక్కడి దృశ్యాలను ఎప్పటికప్పుడు ఇక్కడి సిబ్బంది పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నారు.

నియోజకవర్గం స్ట్రాంగ్‌రూమ్‌/కౌంటింగ్‌ కేంద్రం

ముషీరాబాద్‌ ఏవీ కాలేజ్‌, దోమలగూడ

మలక్‌పేట అంబర్‌పేట ఇండోర్‌ స్టేడియం

జూబ్లీహిల్స్‌ కేవీబీఆర్‌ ఇండోర్‌ స్టేడియం, యూసుఫ్‌గూడ

సనత్‌నగర్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌, ఓయూ

నాంపల్లి ఫైన్‌ ఆర్ట్స్‌ కాలేజీ, మాసబ్‌ట్యాంక్‌

కార్వాన్‌ గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌, మాసబ్‌ట్యాంక్‌

గోషామహల్‌ కోఠి ఉమెన్స్‌ కాలేజ్‌

చార్మినార్‌ కమల నెహ్రూ పాలిటెక్నిక్‌, ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌

చాంద్రాయణగుట్ట నిజాం కాలేజ్‌, బషీర్‌బాగ్‌

యాకుత్‌పురా వనిత మహా విద్యాలయ, ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌

బహదూర్‌పురా అరోరా లీగల్‌ సైన్సెస్‌ అకాడెమీ, బండ్లగూడ

సికింద్రాబాద్‌ పీజీఆర్‌ఆర్‌ సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌, ఓయూ

కంటోన్మెంట్‌ వెస్లీ కాలేజ్‌, సికింద్రాబాద్‌

ఖైరతాబాద్‌ కేవీబీఆర్‌ ఇండోర్‌ స్టేడియం, యూసుఫ్‌గూడ

అంబర్‌పేట రెడ్డి ఉమెన్స్‌ కాలేజ్‌, వైఎంసీఏ

Advertisement
Advertisement