హైదరాబాద్‌ | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌

Published Tue, Dec 5 2023 5:32 AM

- - Sakshi

ఓట్ల శాతం ఇలా..

మంగళవారం శ్రీ 5 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2023

బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు లభించిన ఓట్ల శాతం పరిశీలిస్తే నాంపల్లిలో 10.12 శాతం, జూబ్లీహిల్స్‌లో 43.94, శేరిలింగంపల్లిలో 43.97, ఉప్పల్‌లో 48 33, ఖైరతాబాద్‌లో 43.48, మల్కాజిగిరిలో 47.12, కుత్బుల్లాపుర్‌లో 46.8, ఎల్‌బీనగర్‌లో 37.74, కూకట్‌పల్లిలో 54.08, రాజేంద్రనగర్‌లో 37.09, ముషీరాబాద్‌లో 49.07, సికింద్రాబాద్‌లో 55.42, మహేశ్వరంలో 40.99, మలక్‌పేటలో 14.12, సనత్‌నగర్‌లో 56.57, కంటోన్మెంట్‌లో 47.43, అంబర్‌పేటలో 50.8, చార్మినార్‌లో 9.05, కార్వాన్‌్‌లో 16.6, బహదూర్‌పురాలో 15.6, చాంద్రాయణగుట్టలో 11.78, యాకుత్‌పురాలో 11.05, గోషామహల్‌లో 39.61, పటాన్‌చెరులో 38.06 శాతం ఓట్లు లభించాయి.

ఎక్కడ? ఎన్ని ఓట్లు?

కుత్బుల్లాపూర్‌లో 1,87,999 ఓట్లు సాధించగా, అత్యల్పంగా కంటోన్మెంట్‌లో 59,057 ఓట్లు సాధించింది. అలాగే, కూకట్‌పల్లిలో1,35, 635, ఖైరతాబాద్‌లో 67,368, జూబ్లీహిల్స్‌లో 80,549, ఉప్పల్‌లో 1,32,433 , సనత్‌నగర్‌లో 72,557, ముషీరాబాద్‌లో 75,207, రాజేంద్రనగర్‌లో 1,21,734 ఓట్లు పోందింది. మహేశ్వరంలో 1,25,578 ఓట్లు, మేడ్చల్‌లో 1,86,017, శేరిలింగంపల్లిలో 1,57,332, మల్కాజిగిరిలో 1,25,049, అంబర్‌పేటలో 74,416 ఓట్లను సాధించింది.

మెజారిటీలు ఇలా...

గ్రేటర్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఖైరతాబాద్‌లో 22,010 ఓట్లు, జూబ్లీహిల్స్‌లో 16,337, ఉప్పల్‌లో 49,429, సనత్‌నగర్‌లో 41,827, ముషీరాబాద్‌లో 37,797, రాజేంద్రనగర్‌లో 32,096 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. అలాగే, బీఆర్‌ఎస్‌ పార్టీ మహేశ్వరంలో 26,187, మేడ్చల్‌లో 33,419, సికింద్రాబాద్‌లో 45,240, శేరిలింగంపల్లిలో 46,552, మల్కాజిగిరిలో49,530, అంబర్‌పేటలో 24,537, కంటోన్మెంట్‌లో 17,169 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది.

Advertisement
Advertisement