రైల్వే ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో సమగ్ర శిక్షణ | Sakshi
Sakshi News home page

రైల్వే ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో సమగ్ర శిక్షణ

Published Sat, Dec 9 2023 5:06 AM

- - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: మౌలాలీలోని జోనల్‌ రైల్వే ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి లభించే సమర్ధవంతమైన శిక్షణ ద్వారానే ఎంతోమంది నిపుణులు విధులు నిర్వహిస్తున్నారని దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ అన్నారు. రైల్వే ఇన్‌స్టిట్యూట్‌ 51వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్‌ మేనేజర్‌, ఆర్‌.ధనుంజయులు, ప్రిన్సిపల్‌ చీఫ్‌ఆపరేషన్స్‌ మేనేజర్‌ బి.నాగ్య, ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ కె.ఆర్‌.కె రెడ్డి, సికింద్రాబాద్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ భరతేష్‌ కుమార్‌ జైన్‌, హైదరాబాద్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ లోకేష్‌ విష్ణోయ్‌, జడ్‌ఆర్‌టీఐ ప్రిన్సిపల్‌, జి.యాదగిరి, సీనియర్‌ రైల్వే అధికారులు, సిబ్బంది, ట్రైనీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణ్‌ కుమార్‌ జైన్‌ మాట్లాడుతూ, ుుజోనల్‌ రైల్వే ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ 51 సంవత్సరాల విశేష సేవలను పూర్తి చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్టేషన్‌ మాస్టర్లు, కమర్షియల్‌ క్లర్క్‌లు వంటి ఫ్రంట్‌లైన్‌ సిబ్బందికి శిక్షణను అందించే ఈ సంస్థ సిబ్బందికి నియమాలు, నిబంధనలపై పునాది వేయడంలో, బాగా ప్రావీణ్యం ఉండేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఆఫ్‌లైన్‌ శిక్షణ నుండి హైబ్రిడ్‌ మోడల్‌కి మారడం ద్వారా ఇన్‌స్టిట్యూట్‌ శిక్షణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి దారితీసిన ప్రయత్నాలను మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలోడిజిటల్‌ బోర్డులు, జెడ్‌.ఆర్‌.టి.ఐ హిందీ యాప్‌, ట్రైనీ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌, కాన్ఫరెన్స్‌ హాల్‌, ఐ.టి ల్యాబ్‌లను ఆయన ప్రారంభించారు. ఆపరేటింగ్‌ మాన్యువల్‌, జెడ్‌.ఆర్‌.టి.ఐ వార్షిక పత్రికను విడుదల చేశారు. శిక్షణలో ప్రతిభకనబరిచిన టాపర్లను జనరల్‌ మేనేజర్‌ అభినందించి, మెడల్స్‌, మెరిట్‌ సర్టిఫికెట్‌లకు అందజేశారు. వార్షిక స్పోర్ట్స్‌ మీట్‌లో విజేతలు, రన్నరప్‌లకు రోలింగ్‌ షీల్డ్‌లను బహూకరించారు. ఈ శిక్షణా సంస్థలో 11 నెలల వ్యవధిలో మొత్తం 5,767 మందికి శిక్షణనిచ్చారు.

దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌

Advertisement
Advertisement