ఆర్‌టీసీ బస్‌డిపోలో రెండు బస్సులు దగ్ధం | Sakshi
Sakshi News home page

ఆర్‌టీసీ బస్‌డిపోలో రెండు బస్సులు దగ్ధం

Published Tue, Jan 23 2024 6:42 AM

దిల్‌సుఖ్‌నగర్‌ సిటి డిపోలో అగ్నికి ఆహుతైన రెండు డీలక్స్‌ బస్‌లు  - Sakshi

చైతన్యపురి: దిల్‌సుఖ్‌నగర్‌లోని ఆర్‌టీసీ డిపోలో సోమవారం ఉదయం అనుమానాస్పదంగా మంటలంటుకుని రెండు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్‌లు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్ని ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూటా లేక మరేదైనా కారణం అయి ఉంటుందా అని ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.... ఉదయం 4.50 గంటలకు ధర్మయ్య అనే డ్రైవర్‌ విధుల కోసం బస్‌డిపోకు చేరుకున్నారు. తనకు కేటాయించిన బస్సు (టీఎస్‌04జడ్‌0173) వద్దకు వెళ్లి తన బ్యాగ్‌ను బస్‌లో పెట్టి తాగు నీరు తెచ్చుకునేందుకు వాటర్‌ ఫిల్టర్‌ దగ్గరకు వెళ్లాడు.

బస్‌ బయలుదేరేందుకు 45 నిమిషాలు సమయం ఉండటంతో అక్కడే సిబ్బందితో మాట్లాడుతున్నాడు. బస్‌ గ్యారేజ్‌ ఎదురుగా పార్కు చేసి ఉన్న బస్‌ నుంచి పొగలు రావటం గమనించిన మెకానిక్‌లు కొందరు బస్‌ దగ్గరకు పరుగెత్తారు. బస్‌ అడుగున బ్యాటరీ, గేర్‌బాక్స్‌ మధ్యలో మంటలు వస్తుండటంతో పైర్‌ సేఫ్టీ సిలెండర్‌ తీసుకొచ్చి ఆపే ప్రయత్నించారు. కానీ ఆగక పోగా క్షణాల్లోనే బస్‌మొత్తం వ్యాపించాయి. ఈలోగా కొంత మంది మెకానిక్‌లు మంటలు అంటుకున్న బస్‌ పక్కన ఉన్న మూడు బస్‌లను అక్కడ నుంచి తరలించారు. ప్రమాదం జరిగిన బస్‌ పక్కన ఉన్న మరో బస్‌తీసేందుకు వీలు కాక పోవటంతో (టీఎస్‌ 04 జడ్‌ 0193) బస్‌కు కూడా మంటలు వ్యాపించి పూర్తిగా కాలిపోయింది. ఈలోగా సమాచారం అందుకున్న మలక్‌పేట ఫ్రైర్‌ స్టేషన్‌ సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పేశారు. రెండు బస్‌లు పూర్తిగా దగ్ధం కాగా మరో గూడ్స్‌ వాహనం కొద్దిగా కాలింది.

ప్రమాదానికి కారణం షార్ట్‌ సర్క్యూటేనా..?
దిల్‌సుఖ్‌నగర్‌ సిటీ డిపోలో రెండు బస్‌లు దగ్దం కావటానికి కారణం షార్ట్‌ సర్క్యూటా లేక మరదైన కారణం ఉందా అని అనుమానాలు కలుగుతున్నాయి. మంటలు ముందుగా అంటుకున్న బస్‌ చౌటుప్పల్‌ రూట్‌లో నడుపుతారు. గేర్‌ బాక్స్‌లో ప్రాబ్లం ఉండటంతో రెండు రోజులుగా నడపటం లేదని తెలిసింది. గేర్‌బాక్స్‌ మరమ్మత్తు పూర్తి చేసిరాత్రి 9గంటల సమయంలో బస్‌ వాషింగ్‌ చేసి పార్కు చేసినట్లు మెకానిక్‌లు తెలిపారు.

బ్యాటరీ నుంచి వచ్చే వైర్లు ఏవైనా షార్ట్‌ అయి మంటుల వ్యాపించి గాలి ఎక్కువగా ఉండటంతో పక్కన ఉన్న బస్‌కూడా దగ్దం అయిందని అధికారులు తెలుపుతున్నారు. బస్‌లో తన బ్యాగ్‌ పెట్టి వాటర్‌ కోసం వేళ్లానని డ్రైవర్‌ దర్మయ్య తెలుపుతుండగా మంటలు అంటుకున్న సమయంలో బస్‌ స్టార్ట్‌కీ అన్‌ చేసిఉందని కొంతమంది డిపో సిబ్బంది చెప్పటం గమనార్హం. టీఎస్‌ఆర్‌టీసీ ప్రధాన కార్యాలయం నుండి పలువురు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై మలక్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో డిపో మేనేజర్‌ హరి పిర్యాదు చేశారు.

1/1

Advertisement
Advertisement