భౌతికశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ | Sakshi
Sakshi News home page

భౌతికశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌

Published Tue, Oct 6 2020 4:32 PM

3 Scientists SHare Nobel Physics Prize For Black Hole Research - Sakshi

స్టాక్‌హోమ్‌ : భౌతికశాస్త్రంలో విశేష పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలను 2020సంవత్సరానికి గానూ ప్రఖ్యాత నోబెల్‌ పురస్కారం వరించింది. అంతరిక్షంలో కృష్ణ బిలం ఎలా ఏర్పాటవుతుందో సూత్రీకరించిన బ్రిటన్‌ సైంటిస్ట్‌ రోజర్‌ పెన్‌రోజ్‌, జర్మనీ శాస్త్రవేత్త రీన్‌హర్డ్‌ గెంజెల్‌తో పాటు పాలపుంత కేంద్రకంపై పరిశోధనలు చేసిన అమెరికన్‌ ప్రొఫెసర్‌ అండ్రియా గెజ్‌ను ఈ పురస్కారానికి నోబెల్‌ కమిటీ మంగళవారం ఎంపిక చేసింది. అవార్డు కింద బంగారు పతకం, కోటి స్వీడిష్‌ క్రోనార్లు (రూ.8.22 కోట్లు) నగదు లభిస్తుంది. అయితే ఇందులో రోజర్‌ పెన్‌రోస్‌కు సగం పురస్కారాన్ని ఇవ్వగా, మిగత సగాన్ని రిన్‌హార్డ్‌, ఆండ్రియాలు పంచుకోనున్నారు.
(చదవండి : వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్‌ పురస్కారం)

Advertisement
Advertisement