రైలులో మంటలు..ఏడుగురు సజీవదహనం

28 Apr, 2023 06:02 IST|Sakshi

కరాచీ: పాకిస్తాన్‌లో ఎక్స్‌ప్రెస్‌ రైలులో చెలరేగిన మంటల్లో నలుగురు చిన్నారులు, ఒక మహిళ సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కరాచీ నుంచి లాహోర్‌ వెళ్తున్న రైలు ఏసీ బోగీలో బుధవారం అర్ధరాత్రి తర్వాత మంటలు చెలరేగాయి.

గమనించిన డ్రైవర్‌ వెంటనే టాండో మస్తి ఖాన్‌ స్టేషన్‌లో రైలును ఆపేసి, మంటలు అంటుకున్న బోగీని వేరు చేశారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ దుర్ఘటనలో నలుగురు చిన్నారులు, ఒక మహిళ సహా ఏడుగురు సజీవ దహనమయ్యారు. ఆరు మృతదేహాలు గుర్తు పట్టడానికి కూడా వీలు లేనంతగా కాలిపోయాయి. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని అధికారులు చెప్పారు. 

మరిన్ని వార్తలు