మహిళా హక్కులకు పాతర | Sakshi
Sakshi News home page

మహిళా హక్కులకు పాతర

Published Mon, Feb 7 2022 5:36 AM

Afghan women face increasing violence and repression under the Talibans - Sakshi

అట్లాంటా: అఫ్గాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత దేశంలో మహిళల పరిస్థితి ఘోరంగా మారిందని అంతర్జాతీయ హక్కుల సంఘాలు ఆరోపించాయి.  ముఖ్యంగా మహిళలు, స్వలింగ సంపర్కులు, హిజ్రాల పరిస్థితి దేశంలో దుర్భరంగా మారుతోందని హ్యూమన్‌రైట్స్‌ వాచ్‌ సంస్థ తెలిపింది. తాలిబన్లు గతంలో అధికారంలోకి వచ్చినప్పుడు జరిగిన హక్కుల హననమే పునరావృతం అవుతోంది. వీరి పాలనలో మహిళలు రెండు రకాలుగా బాధితులవుతున్నారు. లైంగిక పరమైన దాడులు ఒక సమస్య కాగా, అలాంటి బాధితులపై సొంతవారి అకృత్యాలు రెండో సమస్యగా మారాయని హక్కుల కార్యకర్తలు వివరిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement