AI: త్వరలోనే ‘ఏఐ’తో ఆ ముప్పు! | Sakshi
Sakshi News home page

త్వరలోనే ఏఐతో ఆ ముప్పు! నిపుణుల హెచ్చరిక ఇదే..

Published Tue, Feb 20 2024 11:18 AM

Ai Will Destroy Humankind In Few Years Predicts Expert - Sakshi

కాలిఫోర్నియా: కీడెంచి మేలు ఎంచాలంటారు పెద్దలు. కానీ జనరేటివ్‌ ఏఐ(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) విషయంపై అందరూ చేస్తోంది దాంతో వచ్చే మేళ్ల గురించిన చర్చే. ఈ అత్యాధునిక టెక్నాలజీతో భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లపై ఎవరూ ఆలోచించడం లేదు. అయితే మెషిన్‌ ఇంటెలిజెన్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వ్యవస్థాపకుడు ఎలిజర్‌ యడ్కోవ్‌స్కీ మాత్రం ఈ కోణంలో ఆలోచించి మానవాళికి ఏఐతో ఏ రేంజ్‌లో ముప్పు పొంచి ఉందో చెబుతున్నాడు.

గార్డియన్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏఐకి సంబంధించి యడ్కోవ్‌స్కీ ఒక సంచలన విషయం వెల్లడించాడు. మరో రెండేళ్లు లేదంటే ఐదేళ్లు, మరీ  అడిగితే ఓ పదేళ్లు మాత్రమే మానవాళికి మిగిలి ఉన్న గడువని చెప్పాడు. మిగిలిన గడువు అని యడ్కోస్కీ వాడిన పదానికి ఆయనను ఇంటర్వ్యూ చేసిన టామ్‌ లామంట్‌ అర్థం చెప్పే ప్రయత్నం చేశాడు.

టర్మినేటర్‌, మ్యాట్రిక్స్‌ సినిమాల్లో చూపించినట్లు  మెషీన్లతోనే అంతం అని లామంట్‌ వివరించాడు. భవిష్యత్తులో భారీ సంఖ్యలో ఉద్యోగాలు పోతాయని చాలా మంది ఏఐని విమర్శిస్తున్న విషయం తెలిసిందే. అయితే యడ్కోవ్‌స్కీ మాత్రం ఒక అడుగు ముందుకేసి ఏఐతో ఏకంగా మానవాళికే ముప్పు అని అతని స్టైల్‌లో హెచ్చరించాడు. గతంలోనూ డేటా సెంటర్ల విషయంలో బాంబింగ్‌ డేటా సెంటర్లనే పదాన్ని ఈయన వాడాడు. అయితే దీని విషయంలో కొద్దిగా పునరాలోచనలో పడ్డానని కూడా అతడే తర్వాత చెప్పడం గమనార్హం.  

ఇదీ చదవండి.. సొంత దేశంపై  ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు 

Advertisement
Advertisement