ఇక అక్కడ ‘మీడియా బార్గెయినింగ్‌ కోడ్‌’!

13 Feb, 2021 04:18 IST|Sakshi

ఆయా వార్తలకు డబ్బులు చెల్లించాలి

గూగుల్, ఫేస్‌బుక్‌లకు వ్యతిరేకంగా ఆస్ట్రేలియా త్వరలో కొత్త చట్టం

కాన్‌బెరా: తమ మాధ్యమాలలో కనిపించే వార్తలకు, వార్తాకథనాలకు సంబంధించి ఆయా ఆస్ట్రేలియన్‌ వార్తాసంస్థలకు ఫేస్‌బుక్, గూగుల్‌ డబ్బులు చెల్లించేలా ఆస్ట్రేలియా కొత్త చట్టం తీసుకువస్తోంది. సంబంధిత బిల్లుపై వచ్చేవారం ఆస్ట్రేలియా పార్లమెంటులో చర్చ జరగనుంది. డిసెంబర్‌ నెలలోనే ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అప్పటినుంచి సెనెట్‌ ఎకనమిక్స్‌ లెజిస్టేషన్‌ కమిటీ ఈ బిల్లును క్షుణ్నంగా అధ్యయనం చేసి, ముసాయిదా బిల్లులో ఎలాంటి మార్పులు అవసరం లేదని శుక్రవారం నివేదిక ఇచ్చింది.

ఈ ‘మీడియా బార్గెయినింగ్‌ కోడ్‌’ ఆచరణ సాధ్యం కాదన్న గూగుల్, ఫేస్‌బుక్‌ల వాదనను కమిటీ తోసిపుచ్చింది. ఈ బిల్లు ప్రకారం ఫేస్‌బుక్, గూగుల్‌ సంస్థలు తమ ప్లాట్‌ఫామ్స్‌పై కనిపించే వార్తలకు సంబంధిత ఆస్ట్రేలియా వార్తా సంస్థలకు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆయా వార్తాసంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే.. ఆస్ట్రేలియాలో తమ సెర్చ్‌ ఇంజిన్‌ సేవలను నిలిపేస్తామని గూగుల్‌ ఇప్పటికే హెచ్చరించింది. తమ యూజర్లు ఆస్ట్రేలియాకు సంబంధించిన వార్తలను షేర్‌ చేసుకోకుండా నిషేధిస్తామని ఫేస్‌బుక్‌ కూడా పేర్కొంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు