కరిగి, విరిగిన ‘బేబీ’ అగ్ని పర్వతం 

24 Jul, 2023 04:02 IST|Sakshi

అదో కొత్త అగ్ని పర్వతం.. రెండు వారాల కిందే పుట్టింది.. ఇంతలోనే అంతెత్తున పెరిగింది.. లోపలి నుంచి ఉబికివచ్చిన లావా వేడికి అంచులు కరిగి, విరిగి పడింది. లావాను బాంబుల్లా ఎగజల్లింది. ఐస్‌ల్యాండ్‌లోని రేక్జానెస్‌ ద్వీపకల్పం ప్రాంతంలోని ‘బేబీ’ అగ్నిపర్వతం విశేషమిది.

అగ్నిపర్వతాలకు నిలయమైన రేక్జానెస్‌ ప్రాంతంలో గత నెల రోజుల్లో ఏకంగా ఏడు వేల భూప్రకంపనలు వచ్చాయి. రెండు వారాల కింద ఓ చోట అకస్మాత్తుగా సుమారు రెండున్నర కిలోమీటర్ల పొడవున భూమిలో పగుళ్లు వచ్చాయి. అందులో ఓ చోట లావా వెలువడటం మొదలై, మెల్లగా అగ్ని పర్వతంలా ఏర్పడింది.

ప్రస్తుతం ‘బేబీ వల్కనో’గా పిలుస్తున్న ఈ అగ్నిపర్వతం.. రెండు రోజుల కింద తీవ్రస్థాయిలో లావా వెలువరించడం మొదలుపెట్టింది. అది తీవ్ర స్థాయికి చేరి ఓ పక్క విరిగి.. లావా నదిలా ప్రవహిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఐస్‌ల్యాండ్‌ యూనివర్సిటీ వల్కనాలజీ అండ్‌ నేచురల్‌ హజార్డ్స్‌ పరిశోధకుల బృందం విడుదల చేసింది.  

మరిన్ని వార్తలు