ఈక్వెడర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి

13 Dec, 2021 13:28 IST|Sakshi

క్విటో: ఈక్వెడర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం​ చోటు చేసుకుంది. అమెజోనియన్‌ రాష్ట్రంలోని సుకువాలో బస్సు బొల్తాపడింది. ఈ ఘటనలో 18 మంది సంఘటన స్థలంలోనే మృతిచెందారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు.

స్థానికులతో కలిసి సహయక చర్యలు చేపట్టారు. క్షత గాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మృతి చెందినవారిని మార్చురీకి తరలించారు. కాగా, బస్సు ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. 

చదవండి: అత్యాచార ఆరోపణలు.. బాధితురాలికి అలీబాబా షాక్‌

మరిన్ని వార్తలు