భారత్‌లోని ఆ నగరాల్లో జాగ్రత్త: తమ పౌరులకు కెనడా అడ్వైజరీ | Sakshi
Sakshi News home page

భారత్‌లోని ఆ నగరాల్లో జాగ్రత్త: తమ పౌరులకు కెనడా అడ్వైజరీ

Published Fri, Oct 20 2023 2:06 PM

Canada Urges Citizens To Be Cautious In These Indian Cities - Sakshi

భారత్‌- కెనడా మధ్య దౌత్యపరమైన వివాదం చల్లారడం లేదు. ఖలిస్తానీ సానుభూతిపరుడు నిజ్జార్‌ సింగ్‌ హత్యతో భారత్‌ ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపణలు చేడంతో మొదలైన ఇరు దేశాల మధ్య మొదలైన ఉద్రిక్తతలు.. నెల రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా భారత్‌లోని తమ దేశ పౌరులు అప్రమత్తంగా ఉండాలని కెనడా పేర్కొంది. ఈ మేరకు కెనడా ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. 

భారత్‌లో 41 మంది దౌత్య సిబ్బందిని ఉపసంహరించుకుని, తమ దౌత్యకార్యాలయాలు, కాన్సులేట్‌లను మూసివేసినట్లు అధికారికంగా ప్రకటించిన గంటల వ్యవదిలోనే.. కెనడా ఈ ప్రకటన చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

‘భారత్‌, కెనడా మధ్య నెలకొన్న పరిణామాల నేపథ్యంలో..  మీడిమా, సామాజిక మాద్యమాల్లో మీడియాలో  కెనడాపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.  ఈ క్రమంలో కెనడా వ్యతిరేక ఆందోళనలు, నిరసనలు జరిగే అవకాశాలు ఉన్నాయి.  కెనడియన్లకు బెదిరింపులు అందవచ్చు. వేధింపులకు గురికావచ్చు.  జాతీయ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో(ఎన్‌సీఆర్‌) జాగ్రత్తగా ఉండండి. అపరిచితులతో ఎక్కువగా మాట్లడకండి. కొత్త వ్యక్తులతో వ్యక్తిగత సమాచారాన్ని వారితో పంచుకోవద్దు’ అని అడ్వైజరీలో పేర్కొంది.
చదవండి: భారత్ నుంచి కెనడా దౌత్యవేత్తల ఉపసంహరణ

బెంగళూరు, చండీగఢ్‌, ముంబై నగరాల్లోనూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది.  పెద్ద నగరాల్లో, పర్యాటక ప్రాంతాల్లో విదేశీయులు లక్ష్యంగా చేసుకుని కొంత మంది డబ్బు, పర్స్‌ దొంగతనాలకు పాల్పడుతుంటారని.. రద్దీ ప్రదేశాలకు వెళ్లినప్పుడు అప్రమత్తంగా వ్యహరించాలని, పెద్ద సంఖ్యలో డబ్బులు తీసుకెళ్లవద్దంటూ పేర్కొంది.

అదే విధంగా సిబ్బందిని తగ్గించిన నేపథ్యంలో ముంబయి, బెంగళూరులోని కాన్సులేట్లలో  అన్ని రకాల ఇన్‌-పర్సన్‌ సేవలను నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ మూడు నగరాల్లోని తమ పౌరులను జాగ్రత్తగా ఉండాలని కోరింది.  భారతదేశంలోని కెనడియన్లందరూ తమకు సహాయం కావాలంటే న్యూ ఢిల్లీలోని హైకమిషన్‌ను సంప్రదించవలసిందిగా కోరారు.

Advertisement
Advertisement