Sakshi News home page

కరోనా కాలం: మరోసారి వక్రబుద్ధి చాటుకున్న చైనా

Published Tue, Apr 27 2021 9:19 AM

China Suspends Cargo Flights Rushing Medical Supplies To India - Sakshi

న్యూఢిల్లీ: కరోనా కష్టకాలంలో చైనా తన వక్రబుద్ధిని చాటుకుంది. భారత్‌ కు అండగా ఉంటామని బహిరంగంగా ప్రకటించిందో లేదో అంతలోనే తూచ్‌ మేమేం చేయలేమంటూ చేతులెత్తేసింది. భారత్‌లో కరోనా విజృంభిస్తుండటంతో సాయం చేసే అవకాశం లేదంటూ మాటమార్చింది. భారత్‌లో కరోనా కోరలు చాస్తున్న నేపథ్యంలో వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ భారత్‌ కు తగిన సాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఇక డబ్ల్యూహెచ్‌ఓ తో పాటూ అమెరికా, సింగపూర్‌, దుబాయ్‌, దాయాది దేశం పాకిస్తాన్‌ సైతం అండగా నిలుస్తామని ప్రకటించాయి. 

ఈక్రమంలోనే నాలుగు రోజుల క్రితం డ్రాగన్‌ కంట్రీ చైనా సైతం భారత్‌ ను ఆదుకుంటామని, ప్రపంచ మానవాళికి ఉమ్మడి శత్రువు కరోనా అని, దానిపై పోరాటం చేసేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చింది. కానీ ఇప్పుడు భారత్‌ లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయంటూ కొత్త రాగం అందుకుంది. భారత్‌ లో ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, ఇతర మెడికల్‌ ఎక్విప్‌ మెంట్‌ కొరత కారణంగా కేంద‍్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచ దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది.

మనదేశానికి చెందిన పలు ప్రైవేట్‌ సంస్థలు ఇప్పటికే చైనా కంపెనీలతో సంప్రదింపులు జరిపాయి. డ్రాగన్‌ కంట్రీ నుంచి ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు పాటూ ఇతర మెడికల్‌ ఎక్విప్‌ మెం‍ట్‌  భారత్‌ రావాల్సి ఉంది. కానీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయని, కార్గో విమానాలన్నింటిని 15 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు సిచువాన్‌ ఎయిర్‌ లైన్స్‌ లో భాగమైన సిచువాన్‌ చువాన్‌హాంగ్‌ లాజిస్టిక్స్‌ లేఖ రాసింది. సేల్స్‌ ఏంజెట్లకు రాసిన లేఖలో చైనా నుంచి ఢిల్లీకి వచ్చే ఆరు రవాణా మార్గాల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొంది.    ​   
 
మరోవైపు భారత్‌ లో కరోనా పరిస్థితులను క్యాష్‌ చేసుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది. భారత్‌ కు పంపే ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్ల, ఇతర మెడికల్‌ ఎక్విప్‌ మెంట్‌ ధరల్ని 35 నుంచి 40 శాతం పెంచనున్నట్టు తెలుస్తోంది. సరుకు రవాణా ఛార్జీలను 20 శాతానికి పెంచినట్లు షాంఘైకి చెందిన సినో గ్లోబల్ లాజిస్టిక్స్‌ సంస్థ ప్రతినిధి సిద్ధార్థ్ సిన్హా ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement