నీ ఆయువు గట్టిది కాబట్టే తప్పించుకున్నావ్‌!

26 Oct, 2021 15:59 IST|Sakshi

బ్రస్సీలియా: సాధారణంగా చాలా మంది కొత్త ప్రదేశాలకు వెళ్లగానే నీటిని చూసి సంబరపడిపోతుంటారు. నీటిలో దిగి స్విమ్మింగ్‌ చేయడానికి ఇష్టపడతారు.  అయితే, ఇలాంటి సమయాల్లో ఒక్కొసారి షాకింగ్‌ సంఘటనలు జరుగుతుంటాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి బ్రెజిల్‌లోని క్యాంపో గ్రాండెలోని లాగో డో అమోర్‌ సరస్సులో చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

మిస్టర్‌ కెటానో అనే వ్యక్తి.. గత శనివారం(అక్టోబరు 23)న సాయంత్రం సరదాగా అమోర్‌ సరస్సులో స్విమ్మింగ్‌ చేయడానికి దిగాడు. అతగాడు.. స్విమ్‌ చేస్తూ నిషేధిత ప్రదేశం దాటి నీటిలోపలికి వెళ్లిపోయాడు. కాగా, విల్యాన్‌ కెటనో అనే మరో వ్యక్తి గట్టుపై నుంచి సరస్సును వీడియో తీస్తున్నాడు. సరస్సులో ఒక వ్యక్తి నిషేధిత ప్రాంతంను దాటి లోపలికి వెళ్లడంను గమనించాడు. అతడిని కదలికలను వీడియో తీస్తున్నాడు.

ఆ సరస్సు మొసళ్లకు ప్రసిద్ధి. అక్కడ.. చాలా మొసళ్లు ఉన్నాయి. అందులో ఒక మొసలి.. మిస్టర్‌ కెటానోవైపు వేగంగా వచ్చి దాడిచేసింది. నీటిలో ఏదో అలజడి రావడంతో వెంటనే వెనక్కు చూశాడు. ఒక మొసలి తన వైపుకు వేగంగా రావడాన్ని గమనించాడు. అతను కూడా.. వేగంగా స్విమ్మింగ్‌ చేస్తూ సరస్సు ఒడ్డుకు చేరుకున్నాడు. అప్పటికి అతని చేతికి, శరీర భాగాలను మొసలి గాయపర్చింది. 

వెంటనే మిస్టర్‌ కెటానోను..  స్థానికులు మొబైల్‌ ఎమర్జెన్సీ అంబూలెన్స్‌కి సమాచారం అందించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మిస్టర్‌ కెటానో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘వెంట్రుక వాసిలో తప్పించుకున్నావు..’, ‘నీ ఆయువు గట్టిదే..’ ‘వామ్మొ... ఎంత భయంకరంగా ఉందో? అంటూ కామెంట్‌లు పెడుతున్నారు.

చదవండి: మందు.. సోడా.. మంచింగ్‌.. ఆ కోతే వేరబ్బా!

మరిన్ని వార్తలు