రిపోర్టర్‌ మైక్‌ లాక్కొని కుక్క పరుగో పరుగు..చివరికి

4 Apr, 2021 12:37 IST|Sakshi

రష్యా: ఫీల్డ్లో రిపోర్టర్లకు ఒక్కోసారి చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. అటువంటి విచిత్ర పరిస్థితే రష్యాలోని ఓ రిపోర్టర్‌కు ఎదురైంది. లైవ్‌లో రిపోర్టింగ్‌ చేస్తుండగా పాపం కుక్క బిస్కేట్‌ అనుకుందో ఏమోగానీ, ఆమె చేతిలోని మైక్ లాక్కుని పరుగులు తీసింది. అయితే ఆ కెమెరామెన్.. రిపోర్టర్ తిప్పలు రికార్డ్ చేయడంతో ఆ వీడియో కాస్తా వైరల్గా మారింది.

వీడియోలో ఉన్నది మిర్ టీవీ వెదర్ రిపోర్టర్ నాడెజ్దా సెరెజ్కిన అంటూ వాతావరణ విశేషాలు చెప్పడానికి సిద్ధం అవుతుండగా ఇంతలో ఓ కుక్క ఆమె చేతుల్లోని మైక్రోఫోన్ లాక్కుంది. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామంతో ఆమె అవాక్కయింది. తేరుకునే లోగానే ఆ కుక్క మైక్ను నోట కరుచుకుని పరుగులు తీసింది. ఆ తరువాత ఆ రిపోర్టర్ కూడా ఆ కుక్కను వెనకాలే పరిగెత్తింది. చివరికి పట్టు వదలకుండా కుక్క నోట్లో నుంచి తిరిగి తన మైక్‌ను సాధించింది. అనంతరం ఈ వీడియోను ”రష్యాలో ఒక కుక్క రిపోర్టర్ చేతిలోని మైక్రోఫోన్ లాక్కుని పరుగులు తీసింది.” అని క్యాప్షన్తో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారి నెటిజన్లను నవ్విస్తోంది. ( చదవండి: భారతీయ టెక్కీలకు భారీ ఊరట )

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు