దుబాయ్‌లో అతి పెద్ద విమానాశ్రయం.. ప్రత్యేకతలు ఇవే.. | Sakshi
Sakshi News home page

దుబాయ్‌లో అతి పెద్ద విమానాశ్రయం.. ప్రత్యేకతలు ఇవే..

Published Mon, Apr 29 2024 7:51 AM

Dubai To Have World Largest Airport Soon

దుబాయ్‌లో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దుబాయ్‌లో నిర్మించబోతున్నారు. ఈ మేర‌కు దుబాయ్ రాజు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్ర‌క‌ట‌న చేశారు. దీని కోసం 35 బిలియన్‌ డాలర్లు (రూ.2.9 లక్షల కోట్లు) ఖర్చు చేయనున్నారు.

వివరాల ప్రకారం.. దుబాయ్‌లో ప్ర‌పంచంలోనే అతిపెద్ద విమానాశ్ర‌యం నిర్మించచోతున్నారు. ఈ విషయాన్ని దుబాయ్‌ రాజు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తోమ్‌ ఆదివారం ప్రకటించారు. ఈ విమానాశ్రయం పేరును అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పిల‌వ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఇది ఈ విమానాశ్రయాం నిర్మించడానికి 35 బిలియన్‌ డాలర్లు (రూ.2.9 లక్షల కోట్లు) ఖర్చు చేయనున్నారు. ఏడాదికి 260 మిలియన్ల మంది రాక‌పోక‌లు కొన‌సాగించేలా ఈ విమానాశ్ర‌యాన్ని నిర్మిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

ఒక్క ఏడాదిలో దాదాపు 260 మిలియన్ల మంది ప్రయాణీకులు ఈ ఎయిర్‌పోర్టు ద్వారా ప్ర‌యాణాలు కొన‌సాగించ‌వ‌‍చ్చన్నారు. ఈ విమానాశ్రయంలో ఐదు సమాంతర రన్‌వేలు, 400 ఎయిర్‌క్రాఫ్ట్‌ గేట్స్‌ దీని ప్రత్యేకతలుగా చెప్పారు. కాగా, అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్ర‌స్తుత‌ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కంటే ఐదు రెట్లు పెద్దదిగా ఉంటుంది. రాబోయే సంవత్సరాల్లో దుబాయ్ ఎయిర్‌పోర్టు నుండి అన్ని కార్యకలాపాలు అల్ మక్తూమ్‌కు బదిలీ చేయడం జ‌రుగుతుంద‌ని స్పష్టం చేశారు.

 

 

ఇక, ఈ ఎయిర్‌పోర్టు ఫ్లాగ్‌షిప్ క్యారియర్ ఎమిరేట్స్, లోబడ్జెట్‌ విమానయాన సంస్థ ఫ్లైదుబాయ్‌తో పాటు ప్రపంచాన్ని దుబాయ్‌కి, బయటికి కనెక్ట్ చేసే అన్ని ఎయిర్‌లైన్ భాగస్వాములకు కొత్త డెస్టినేష‌న్‌ కానుందని దుబాయ్ ప్రభుత్వ ఎయిర్‌లైన్ ఎమిరేట్స్ చైర్మన్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్-మక్తూమ్ వెల్ల‌డించారు. ఈ నిర్మాణం ప్రపంచ వేదికపై ప్రముఖ ఏవియేషన్ హబ్‌గా దుబాయ్ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుందని దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సీఈఓ పాల్ గ్రిఫిత్స్ తెలిపారు.
 

Advertisement
Advertisement