మెర్క్‌ కరోనా మాత్రకు యూఎస్‌ ఆమోదం | Sakshi
Sakshi News home page

మెర్క్‌ కరోనా మాత్రకు యూఎస్‌ ఆమోదం

Published Fri, Dec 24 2021 6:30 AM

FDA Okays Emergency Use of Molnupiravir Pill for COVID-19 - Sakshi

వాషింగ్టన్‌: కరోనాను నియంత్రించేందుకు మెర్క్‌ కంపెనీ తయారు చేసిన మాత్ర– మోన్యుపిరావిర్‌కు అమెరికా ఔషధ నియంత్రణా సంస్థ(యూఎస్‌ఎఫ్‌డీఏ) గురువారం ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఫైజర్‌ మాత్రకు ఎఫ్‌డీఏ ఓకే చెప్పింది. ఫైజర్‌ పిల్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌’ తక్కువ, కానీ మెర్క్‌ పిల్‌తో సైడ్‌ఎఫెక్ట్స్‌ అధికం. అందుకే దీన్ని సెకండ్‌ ఛాయిస్‌ పిల్‌గా అనుమతించారు.

కరోనా ఆరంభ లక్షణాలున్న వయోజనులు, అందులో ఆస్పత్రి పాలయ్యే రిస్కు అధికంగా ఉన్నవారికి ఈ పిల్‌ను ఇవ్వవచ్చని సంస్థ తెలిపింది. రోగులు 5 రోజుల పాటు రోజుకు 2మార్లు 4 మాత్రలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే కోర్సు మొత్తం మీద 40 మాతల్రు అవసరపడతాయి. కరోనా జన్యువుల్లో మార్పులు చేసి దాని ప్రత్యుత్పత్తిని తగ్గించేందుకు ఈ ఔషధం తోడ్పడుతుంది. గత నవంబర్‌లో మెర్క్‌పిల్‌కు యూకే ఆమోదముద్ర వేసింది. ఈ మాత్రతో పోలిస్తే ఫైజర్‌ మాత్ర మూడురెట్లు అధికంగా ప్రభావం చూపుతుందని, తక్కువ దుష్ప్రభావాలున్నాయని గణాంకాలు తెలిపాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement