ఘోరం: వివాహ వేడుకలో అగ్ని వర్షం.. వీడియో వైరల్..

3 Oct, 2023 13:42 IST|Sakshi

ఇరాక్‌లో దారుణం జరిగింది. ఓ వెడ్డింగ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 100 మందికిపైగా మృతి చెందారు. 150 మంది గాయపడ్డారు. దక్షిణ ఇరాక్‌లోని కరాకోష్ గ్రామానికి సమీపంలో ఏర్పాటు చేసిన వివాహ వేదికలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

వెడ్డింగ్ కార్యక్రమాలు ఘనంగా ఏర్పాటు చేశారు. జనం కూడా భారీ సంఖ్యలోనే హాజరయ్యారు. వధువరులు ఎంతో ఘనంగా ముస్తాబై వేదిక ఎక్కారు. మిరిమిట్లు గొలిపే కాంతి వెలుగుల  మధ్య స్టెప్పులు వేశారు. ఇంతలోనే వేదిక పై భాగంలో ఏర్పాటు చేసిన ఫ్లవర్ వంటి డెకరేషన్‌కు మంటలు అంటుకున్నాయి. దట్టమైన పొగ కమ్ముకోగా.. ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. 

వేదిక పైభాగం నుంచి అగ్ని వర్షం కురిసిన మాదిరిగా మంటలు కిందికి దూసుకొచ్చాయి. ఏర్పాటు చేసిన డెకరేషన్ విభాగాలు మంటల్లో కాలి కిందపడ్డాయి. జనం ఆహాకారాలతో బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో 100 మంది చనిపోగా.. 150 మంది గాయపడ్డారు. నాసిరకమైన డెకరేషన్ వస్తువుల వల్లే ఇదంతా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వేదిక నిర్మాణంలో మండే స్వభావం ఉన్న డెకరేషన్ ఐటమ్స్‌ను ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు.  

ఇదీ చదవండి: Pakistan Earthquake Prediction: పాకిస్తాన్‌కు భారీ భూకంపం ముప్పు?

మరిన్ని వార్తలు