Sakshi News home page

రెండు రోజుల్లో 155 ప్రకంపనలు

Published Wed, Jan 3 2024 8:11 AM

Huge earthquake in Japan - Sakshi

వజిమ: జపాన్‌లో సోమ, మంగళవారం సంభవించిన వరుస ప్రకంపనలతో ప్రాణ, ఆస్తి నష్టం భారీగా సంభవించింది. రెండు రోజుల్లో మొత్తం 155 ప్రకంపనలు నమోదైనట్లు భూకంప విభాగం తెలిపింది. సోమవారం మధ్యాహ్నం సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.6గా నమోదు కావడంతో అధికారులు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. మంగళవారం పశ్చిమ తీరంలోని ఇషికావ ప్రిఫెక్చర్‌లో భూకంప సంబంధిత ప్రమాద ఘటనల్లో 50 మందికి పైగా చనిపోగా మరో 16 మంది గాయపడ్డారు. పలు భవనాలు, వాహనాలు ధ్వంసం అయ్యాయి.

విద్యుత్‌ వ్య వస్థలు దెబ్బతినడంతో సుమారు 33 వేల నివాసా లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ప్రధాన హైవేలు దెబ్బతిన్నాయి. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. మళ్లీ భూ ప్రకంపనలు సంభవించే ప్రమాదమున్నందున ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు కోరారు. పశ్చిమ తీరంలోని హొన్షు దీవి నుంచి 97 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు షెల్టర్లలోకి తరలిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జపాన్‌లో భూకంపం నేపథ్యంలో పొరుగునే ఉన్న రష్యా, దక్షిణ కొరియా, ఉత్తర కొరియాలు కూడా సునామీ హెచ్చరికలను జారీ చేశాయి.  

Advertisement

తప్పక చదవండి

Advertisement