హెజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్‌ దాడి.. వీడియో విడుదల | Sakshi
Sakshi News home page

హెజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్‌ దాడి.. వీడియో విడుదల

Published Wed, Apr 10 2024 7:21 AM

Israel Hits Hezbollah Targets In Syria Releases Video - Sakshi

సిరియాలో ఉన్న హెజ్బుల్లా మిలిటెంట్‌ గ్రూప్‌కు సంబంధించిన స్థావరాలపై దాడి చేసినట్ల ఇజ్రాయెల్‌ ఆర్మీ వెల్లడించింది. దాడికి సంబంధించి ఓ వీడియోను ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఆర్మీ విడుదల చేసింది. అక్టోబర్‌ 7 నుంచి హమాస్‌ మిలిటెంట్‌ గ్రూప్‌కు అనుకూలంగా లెబనాన్‌ దేశానికి చెందిన హెజ్బుల్లా ఇజ్రాయెల్‌పై దాడులకు తెగపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సిరియాలో విస్తరించిన హెజ్బుల్లా మిలిటెంట్‌ గ్రూప్‌పై కూడా దాడులు చేస్తామని ఇజ్రాయెల్‌ ఆర్మీ ఇ‍ప్పటికే పదేపదే హెచ్చరించింది. 

‘సిరియాలోని హిజ్బుల్లా మిలిటెంట్‌ గ్రూప్‌ సైనిక స్థావరాలపై ఖచ్చితమైన నిఘా ఆధారంగా దాడి చేశాము’ అని ఇజ్రాయెల్‌ ఆర్మీ ప్రకటించింది. సిరియాలోని ఓ భవనంపైబుధవారం తెల్లవారుజామున దాడి చేసినట్లు తెలిపే ఓ విడియోను ఇజ్రాయెల్‌ ఆర్మీ విడుదల చేసింది.

హిజ్బుల్లా  మిలిటెంట్‌ గ్రూప్‌ కార్యకలాపాలకు సంబంధించి సిరియా  తన భూభాగంలో జవాబుదారిగా ఉంటుంది. కానీ సిరియా  దేశం అవతల హిజ్బుల్లా  దాడులు చేసే ప్రయత్నాలను  అనుమంతిచబోమని ఇజ్రాయెల్‌ ఆర్మీ హెచ్చరించింది. అదే విధంగా దక్షిణ లెబనాన్‌లోని పలు హిజ్బుల్లా మిలిటెంట్‌ స్థావరాలపై దాడి చేసినట్లు ప్రకటించటం గమనార్హం. దక్షిణ లెబనాన్‌లోని ధైరా, తైర్‌ హర్ఫా ప్రాంతాల్లో ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఆర్మీ హిజ్బుల్లా మిలిటెంట్లు లక్ష్యంగా మిసైల్‌ దాడి  చేసినట్ల ఇజ్రాయెల్‌ ఆర్మీ​ తెలిపింది.

Advertisement
Advertisement