జార్ఖండ్‌లో బీహార్‌ ఫార్ములా? ఇద్దరు డిప్యూటీ సీఎంలు? | Sakshi
Sakshi News home page

Jharkhand: జార్ఖండ్‌లో బీహార్‌ ఫార్ములా? ఇద్దరు డిప్యూటీ సీఎంలు?

Published Thu, Feb 15 2024 12:30 PM

Jharkhand Champai Soren Government Expansion - Sakshi

జార్ఖండ్‌లో చంపాయ్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ ఫిబ్రవరి 16న జరగనుంది. కొత్త కేబినెట్‌లో నాలుగైదు కొత్త ముఖాలు కనిపించనున్నాయి. ఇద్దరు మంత్రులకు డిప్యూటీ సీఎం హోదా దక్కనుందని సమాచారం. కాంగ్రెస్ కోటా నుంచి వచ్చిన నలుగురు మంత్రుల్లో బాదల్ పాత్రలేఖ్, బన్నా గుప్తా, రామేశ్వర్ ఓరాన్ సహా మరో ముగ్గురు మంత్రులను మార్చనున్నారు. జార్ఖండ్‌లో బీహార్‌ ఫార్ములాను అనుసరించనున్నట్లు తెలుస్తోంది.

అలాగే భూషణ్ బడా, దీపికా పాండే, రామచంద్ర సింగ్‌లకు మంత్రులుగా అవకాశం కల్పించనున్నారని సమాచారం. మంత్రి పదవికి భూషణ్ బడా, దీపికా పాండే పేర్లు దాదాపు ఖాయమని, రామచంద్ర సింగ్ లేదా ప్రదీప్ యాదవ్ పేర్లపై చర్చ జరగుతోంది.  బసంత్ సోరెన్ 2020లో జరిగిన దుమ్కా ఉపఎన్నికల్లో విజయం సాధించి, మొదటిసారి అసెంబ్లీకి చేరుకోగా, అతని పెద్ద కోడలు సీతా సోరెన్ జామా నుండి మూడవసారి ఎన్నికయ్యారు. 

జేఎంఎంలో హేమంత్‌ సోరెన్‌ తమ్ముడు బసంత్‌ సోరెన్‌, కోడలు సీతా సోరెన్‌లలో ఒకరికి మాత్రమే చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. మహిళా కమిషన్ లేదా మరేదైనా కమిషన్ చైర్‌పర్సన్‌గా సీతా సోరెన్‌కు మంత్రి హోదా ఇవ్వవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement