India-Maldives Row: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుపై అవిశ్వాసానికి పిలుపు | Sakshi
Sakshi News home page

India-Maldives Row: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుపై అవిశ్వాసానికి పిలుపు

Published Tue, Jan 9 2024 8:54 AM

Maldives Leader Calls For Steps To Remove President Muizzu  - Sakshi

మాలే: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జును తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆ దేశ పార్లమెంటరీ మైనారిటీ నాయకుడు అలీ అజీమ్ కోరారు. అవిశ్వాస తీర్మానం పెట్టాలని సభ్యులకు పిలుపునిచ్చారు . మాల్దీవుల మంత్రులు ప్రధాని నరేంద్ర మోదీపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

" స్థిరమైన విదేశాంగ విధానాన్ని పెంపొందిచడానికి డెమొక్రాట్లమైన మేము ప్రయత్నించాం. పొరుగు దేశాలతో సత్సంబంధాలను నెలకొల్పాము. అధ్యక్షుడు @MMuizzu ను అధికారం నుండి తొలగించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మాల్దీవుల సెక్రెటేరియట్  సిద్ధంగా ఉందా? విశ్వాసం లేదా?" అని నాయకుడు ఎక్స్‌లో పేర్కొన్నారు. 

ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్‌ చేశారు. అవి ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు.

ఇది ఇరుదేశాల మధ్య వివాదాస్పద వాతావరణం ఏర్పడటానికి కారణమైంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేశారు. మాల్దీవుల పర్యాటకంపై ప్రముఖులు నిరసన వ్యక్తం చేశారు. బైకాట్ మాల్దీవులు అంటూ నినాదాలు విస్తృతంగా వ్యాప్తి చేశారు. ఈ వివాదంపై ఇరుదేశాలు ఇప్పటికే హైకమిషనర్లకు సమన్లు జారీ చేశారు. 

ఇదీ చదవండి: PM Modi Maldives Controversy: మోదీ పర్యటన తర్వాత లక్షద్వీప్‌ వైపే అందరి చూపు!

Advertisement
Advertisement