Pepsi Bottle QR Code Controversy In Pakistan: Man Threatens To Burn Down Truck - Sakshi
Sakshi News home page

Viral Video: క్యూఆర్‌ కోడ్‌ ఉన్నపెప్సీ ట్రక్‌లను తగలబెట్టేస్తా!

Published Thu, Jan 6 2022 2:40 PM

Man Threatens Burn Down Pepsi Truck Over QR Codes Goes Viral - Sakshi

ప్రముఖ కంపెనీ ఇటీవల ఇచ్చే కొన్ని అడ్వర్టైస్‌మెంట్‌ల విషయంలో కాస్త జాగురకతతో వ్యవహరించకపోతే ఇంతే సంగతులు. ఇటీవల కొన్ని అడ్వర్టైస్‌మెంట్‌లు ఆ పరిస్థితిని ఎదుర్కొన్న ఘటనలను కూడా చూశాం. అయితే వినియోగదారులకు ఉపయుక్తంగా ఇచ్చే క్యూఆర్‌ కోడ్‌ పట్ల పాకిస్తాన్‌లో ఒక వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా క్యూర్‌ కోడ్‌ తీసేయాలి అని హెచ్చరించాడు.

(చదవండి: కోవిడ్‌ అంటే కరోనా కాదు మనిషి పేరు అని తెలుసా!!)

అసలు విషయంలోకెళ్లితే...పాకిస్తాన్‌లోని కరాచీలో రద్దీగా ఉండే రహదారిపై ముల్లా అనే వ్యక్తి సెవెన్‌ అప్‌ పెప్సీ బాటిల్‌ పై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ పై అభ్యంతరం తెలిపాడు. ఈ క్యూఆర్‌ కోడ్‌లో ప్రవక్త ముహమ్మద్ పేరు ఉందని చెబుతున్నాడు. అయితే అతను పక్కన ఉన్న వ్యక్తి ఇమ్రాన్ నోషాద్ ఖాన్ ఇది క్యూఆర్‌ కోడ్‌ అని చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ అంగీకరించలేదు. అంతేకాదు సెవెన్‌ అప్‌ బాటిల్‌ ట్రక్‌కి నిప్పు పెడతానంటూ హెచ్చరించాడు కూడా.

అయితే క్యూఆర్‌ కోడ్‌ వినియోగదారులకు పోషకాహార సమాచారం, తయారీ సమాచారాన్ని అందించే నిమిత్తం పానీయాల కంపెనీలు సీసాలు, డబ్బాలపై ఇస్తారు. ఈ మేరకు ముల్లా ఈ కోడ్‌ని కంపెనీలు తొలగించాలని డిమాండ్ చేశాడు. అంతేకాదు ఈ ఘటనను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయమని తన సహచరుడు ఇమ్రాన్ నోషాద్ ఖాన్ పట్టుబట్టాడు. అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.  ఈ క్రమంలో సంబంధిత కంపెనీ ప్రతినిధి ఖాన్‌కు కృతజ్ఞతలు తెలపడమే కాక క్యూఆర్ కోడ్‌ను మార్చడానికి ప్రయత్నిస్తున్నాం అని చెప్పారని ఆయన తెలిపారు.

(చదవండి: తల్లే పిల్లల్ని కిడ్నాప్‌ చేసింది.. ఎందుకో తెలుసా?)

Advertisement
Advertisement