Massive Earthquake Moved Turkey By 5-6 Metres - Sakshi
Sakshi News home page

Turkey Earthquake: 190 కిమీ పొడవు, 25 కిమీ వెడల్పుతో భారీ పగుళ్లు.. 6 మీటర్లు పక్కకు జరిగిన టర్కీ!

Published Thu, Feb 9 2023 4:59 PM

Massive Earthquake Moved Turkey By 5-6 Metres - Sakshi

ఇస్తాన్‌బుల్‌: టర్కీలో సోమవారం 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘోర వివత్తులో వేల మంది చనిపోయారు. అయితే భూకంపం కారణంగా టర్కీ దేశం ఐదారు మీటర్ల దూరం పక్కకు జరిగినట్లు భూవిజ్ఞాన పరిశోధకులు తెలిపారు.. ట

'సోమవారం టర్కీలో సంభవించిన శక్తివంతమైన భూకంపాలు అది ఉన్న టెక్టోనిక్ ప్లేట్‌లను మూడు అడుగుల నుంచి 10 మీటర్ల వరకు  కదిలించి ఉండవచ్చు. టర్కీ పశ్చిమం వైపు సిరియాతో పోలిస్తే ఐదు నుంచి ఆరు మీటర్లు పక్కకు జరిగే అవకాశం ఉంది.' అని ఇటాలియన్ భూకంప శాస్త్రవేత్త ప్రొఫెసర్ కార్లో డోగ్లియోని స్థానిక వార్తా సంస్థతో మాట్లాడుతూ తెలిపారు.

భూకంప ప్రభావిత ప్రాంతంలోని మార్పుల గురించి మాట్లాడుతూ.. 190 కిలోమీటర్ల పొడవు, 25 వెడల్పుతో భారీ పగుళ్లు ఏర్పడి, భూమి భీకరంగా కదిలిందని పేర్కొన్నారు. తొమ్మిది గంటల వ్యవధిలో రెండు అత్యంత శక్తివంతమైన భూకంపాలు వచ్చాయన్నారు. వాస్తవానికి భూమి కంపిస్తూనే ఉందని రిక్టర్ స్కేల్‌పై 5-6 డిగ్రీల వద్ద తరచుగా గణనీయమైన తీవ్రతతో నాశనం అవుతూనే ఉందన్నారు. అదే సమయంలో చిన్నపాటి కుదుపులకు గురైనట్లు వివరించారు. అంతా క్షణాల్లోనే జరిగిపోయిందని పేర్కొన్నారు.
చదవండి: 38 ఏళ్లోచ్చినా గర్ల్‌ఫ్రెండ్‌ లేదు.. నా కుమారుడులో ఏదో లోపం ఉంది.. ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లికి షాక్..!

Advertisement
Advertisement