Sakshi News home page

పుతిన్‌తో దోవల్‌ భేటీ

Published Fri, Feb 10 2023 6:17 AM

National Security Advisor Ajit Doval Meets Russia President Vladimir Putin In Moscow - Sakshi

న్యూఢిల్లీ: రష్యా పర్యటనలో ఉన్న భారత జాతీయ భద్రతా సలహాదారు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో భేటీ అయ్యారు. గురువారం మాస్కోలో ఈ భేటీ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఇకమీదటా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అఫ్గానిస్తాన్‌ అంశంపై పలు దేశాల అత్యున్నత స్థాయి ప్రతినిధులతో పుతిన్‌ భేటీ అవుతున్నారు.

అందులోభాగంగా గురువారం ఐదవ జాతీయ భద్రతా మండలి/సలహాదారుల సమావేశంలో దోవల్, పుతిన్‌ మాట్లాడుకున్నారని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ తెలిపింది. ‘అఫ్గానిస్తాన్‌లో అనిశ్చితిని అవకాశంగా తీసుకుని కొన్ని ప్రాంతీయేతర శక్తులు అక్కడ మరింతగా విస్తరించేందుకు కుట్ర పన్నుతున్నాయి. అక్కడ పరిస్థితి ఏమంత బాగోలేదు. మానవతాసాయం మరింతగా తగ్గిపోతోంది’ అని పుతిన్‌ అన్నారు. ‘ అఫ్గాన్‌ గడ్డ నుంచి ఉగ్రవాదాన్ని మరింతగా ఎగదోసే చర్యలను భారత్‌ ఏమాత్రం ఉపేక్షించదు. అఫ్గాన్‌ ప్రజలను కష్టాల్లో వదిలేయబోము’ అని దోవల్‌ అన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement