విశ్వాస పరీక్ష నెగ్గిన దేవ్‌బా

19 Jul, 2021 04:08 IST|Sakshi

ఖాట్మండు: నేపాల్‌ నూతన ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవ్‌బా ఆదివారం జరిగిన విశ్వాస పరీక్షలో గెలుపొందారు. ప్రతినిధుల సభలో 275 ఓట్లుండగా, దేవ్‌బాకు 165 ఓట్లు వచ్చాయని హిమాలయన్‌ టైమ్స్‌ తెలిపింది. ఓటింగ్‌లో 249మంది పాల్గొన్నారు. వీరిలో 83 మంది దేవ్‌బాకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఒక సభ్యుడు తటస్థంగా ఉన్నారు. పార్లమెంట్‌ విశ్వాస పరీక్షలో నెగ్గడానికి 136 ఓట్లు కావాల్సిఉంది. కావాల్సిన మెజార్టీ కన్నా అధిక మద్దతునే దేవ్‌బా పొందారు.

పార్లమెంట్‌ను రద్దు చేయవద్దని, దేవ్‌బాను ప్రధానిగా నియమించి విశ్వాస పరీక్షకు అనుమతినివ్వాలని నేపాల్‌ సుప్రీంకోర్టు అధ్యక్షురాలిని ఆదేశించిన సంగతి తెలిసిందే! దీంతో ఈనెల 13న దేవ్‌బా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో కలిపి ఇప్పటికి ఆయన ఐదుమార్లు నేపాల్‌ ప్రధాని పదవి స్వీకరించినట్లయింది. మాజీ ప్రధాని కేపీఓలీ సిఫార్సుతో అధ్యక్షురాలు విద్యాదేవీ  దిగువ సభను మేలో రద్దు చేశారు. ఈ నిర్ణయాన్ని పలువురు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. విచారణ అనంతరం సభ రద్దు నిర్ణయాన్ని కోర్టు కొట్టేసింది.  

మరిన్ని వార్తలు