అక్క‌డ 100 రోజులుగా ఒక్క కేసు లేదు

10 Aug, 2020 18:44 IST|Sakshi

వెల్లింగ్టన్‌: కరోనాను క‌ట్ట‌డి చేసిన ప్రాంతం, వైర‌స్ వ్యాప్తిని నిర్మూలించిన దేశంగా న్యూజిలాండ్ చ‌రిత్ర‌కెక్కింది. అక్క‌డ 100 రోజులుగా ఒక్క క‌రోనా కేసు న‌మోదు కాలేదు. న్యూజిలాండ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 1219 కేసులు న‌మోదు కాగా 22 మంది మాత్ర‌మే మ‌ర‌ణించారు. 23 మాత్ర‌మే యాక్టివ్ కేసులు‌న్నాయి. క‌రోనా కోరల్లో చిక్కుకుని విల‌విల్లాడుతున్న ఇత‌ర దేశాల‌తో పోలిస్తే ఈ సంఖ్య‌ చాలా త‌క్కువ‌. కాగా న్యూజిలాండ్‌లో ఫిబ్ర‌వ‌రి 26న తొలి కేసు వెలుగు చూసింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన ప్ర‌భుత్వం దేశంలో క‌ఠిన‌త‌ర‌మైన‌ కోవిడ్ ఆంక్ష‌ల‌ను అమ‌లు చేసింది. అలాగే పెద్ద సంఖ్య‌లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది. దీంతో కోవిడ్ వ్యాప్తిని కట్ట‌డి చేయ‌గ‌లిగిన ఆ దేశంలో 65 రోజుల త‌ర్వాత అంటే మే1న చివ‌రి కేసు న‌మోదైంది. (మళ్లీ గోల్‌మాల్‌)

100 రోజులుగా దేశంలో సామాజిక వ్యాప్తి కేసులు వెలుగు చూడ‌క‌పోవ‌డం ఓ గొప్ప మైలురాయ‌ని, కానీ ఇప్పుడున్న ప‌రిస్థితుల దృష్ట్యా తాము ఆత్మసంతృప్తితో లేమ‌ని న్యూజిలాండ్‌ ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్‌ డాక్ట‌ర్ ఆష్లే బ్లూమ్‌ఫీల్డ్ పేర్కొన్నారు. కొన్ని దేశాల్లో వైర‌స్ త‌గ్గిన‌ట్టే త‌గ్గి పెరుగుతోంద‌ని, కాబ‌ట్టి భ‌విష్య‌త్తులోనూ ఏవైనా కొత్త కేసులు వెలుగు చూస్తే వాటిని నివారించేందుకు సిద్ధంగా ఉన్నామ‌న్నారు. కాగా తాత్కాలికంగానైనా న్యూజిలాండ్‌ క‌రోనాను జ‌యించింద‌ని, ఇది నిరంత‌ర ప్ర‌క్రియ అని ఆ దేశ ప్ర‌ధాని జ‌సిండా ఆర్డెర్న్ జూన్‌లో ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. (న్యూజిలాండ్‌లో కరోనా జీరో)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు