No Direct Evidence Covid Came From China's Wuhan Lab: US Report - Sakshi
Sakshi News home page

‘వుహాన్‌ ల్యాబ్‌’ ఎపిసోడ్‌లో అదిరిపోయే ట్విస్ట్‌.. చైనాకు అమెరికా క్లీన్‌చిట్‌?

Published Sat, Jun 24 2023 8:32 AM

No Direct Evidence Covid Came From China Wuhan Lab says US Report - Sakshi

వాషింగ్టన్‌: చైనా వుహాన్‌లోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌ నుంచే కరోనా వైరస్‌ పుట్టింది!. అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు మొదటి నుంచి వ్యక్తం చేస్తున్న అనుమానాలు ఇవే. అంతేకాదు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కోవిడ్‌-19 జబ్బు వ్యాప్తి వెనుక కుట్ర కోణం కూడా ఉందన్న ఆరోపణలూ ఉన్నాయి. అయితే చైనా వాటిని ఎప్పటికప్పుడు వాటిని ఖండిస్తూ.. కౌంటర్‌ విమర్శలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో చైనాకు కరోనా విషయంలో దాదాపుగా క్లీన్‌చిట్‌ లభించేసినట్లయ్యింది. 

కోవిడ్‌ మహమ్మారి వుహాన్‌ ల్యాబ్‌ నుంచి పుట్టిందనడానికి ఆధారాలు దొరకలేదు.. ఇది తాజాగా అమెరికా నిఘా సంస్థలు రూపొందించిన నివేదికలోని సారాంశం. అలాగే.. కరోనా పుట్టుక ఎక్కడి నుంచి అనేదానిపైనా స్పష్టత ఇవ్వలేకపోయాయి కూడా. సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీతోపాటు మరో సంస్థ కూడా ఈ దర్యాప్తును చేపట్టగా.. తాజాగా నాలుగుపేజీల నివేదిక బయటకు వచ్చింది.

వుహాన్ ఇనిస్టిట్యూట్‌లో(WIV) కరోనావైరస్‌పై విస్తృతమైన పరిశోధనలు జరిగాయి. కానీ, వ్యాప్తికి అక్కడి నుంచే మొదలైందనడానికి ఆధారాలు మాత్రం లభించలేదు. ప్రత్యక్షంగా ఆ ల్యాబ్‌ నుంచి పుట్టిందని చెప్పడానికి ఆనవాలు ఏం దొరకలేదు.. అని  ఏజెన్సీలు తమ నాలుగు పేజీల నివేదికలో పేర్కొన్నాయి. కరోనా టైంలో ఇనిస్ట్యూట్‌లోని ల్యాబ్‌లో కరోనా పరిశోధనలు జరిగాయి. కానీ, ప్రీ కోవిడ్‌ టైంలో అలాంటి వైరస్‌ల మీద పరిశోధనలు జరిగినట్లు ఆధారాలు దొరకలేదు అని నిఘా నివేదిక వెల్లడించింది. 

గతంలో పలు అధ్యయనాలు.. కరోనా పుట్టుకకు చైనానే కారణమంటూ ఆరోపిస్తూ వచ్చాయి. అగ్రరాజ్యం సంస్థల ఆరోపణల నేపథ్యంలో.. వుహాన్‌లోని పరిశోధనా కేంద్రాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) బృందం 2021 ఫిబ్రవరిలో సందర్శించింది కూడా. కానీ, ఎటూ తేల్చలేకపోయింది. ఇక ఇప్పుడు అమెరికా నిఘా సంస్థలు సైతం ఏం లేదని తేల్చడంతో.. దాదాపుగా వుహాన్‌ ల్యాబ్‌ థియరీకి ముగింపు దొరికిందనే చెప్పొచ్చు. 

చైనాలో అత్యున్నత వైరస్‌ పరిశోధాన కేంద్రాల్లో ఒకటైన ఈ వుహాన్‌ కేంద్రాన్ని 2003లో సార్స్‌ వైరస్‌ విజృంభణ తరువాత నిర్మించారు.

ఇదీ చదవండి: హిందూ సంప్రదాయం ప్రకారం బైడెన్‌కు..

Advertisement

తప్పక చదవండి

Advertisement