కరోనా : 2022 వరకు వారికి టీకా అందదు | Sakshi
Sakshi News home page

ఐదొంతుల జనాభాకు టీకా దూరం..!

Published Wed, Dec 16 2020 10:50 AM

One Fifth of World May Not Get Covid Vaccine Until 2022 - Sakshi

లండన్‌: కరోనా వైరస్ కట్టడి కోసం ప్రపంచదేశాలన్ని వ్యాక్సిన్‌ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇప్పటికే రెండు, మూడు వ్యాక్సిన్‌లు అత్యవసర అనుమతి కూడా పొందాయి. ఈ నేపథ్యంలో బీఎంజే మెడికల్‌ జర్నల్‌ వ్యాక్సిన్‌ పంపిణీకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. దాని ప్రకారం 2022 వరకు ప్రపంచంలో ఐదొందుతల జనాభాకు వ్యాక్సిన్‌ అందదని తెలిపింది. ధనిక దేశాలు ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్‌లని కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నాయని.. ఫలితంగా పేద దేశాల ప్రజలకు వ్యాక్సిన్‌ ఇప్పట్లో అందుబాటులోకి రాదని ఈ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న డజన్ల కొద్దీ వ్యాక్సిన్‌లలో కనీసం ఒకదానిని అయినా పొందే అవకాశాలను పెంచుకోవాలనే ఆత్రుతతో, అనేక దేశాలు అనేక రకాల ఔషధాల కేటాయింపులను తగ్గించాయి. ఇక ప్రపంచ జనాభాలో కేవలం 14 శాతం మాత్రమే ఉన్న సంపన్న దేశాలు ఇప్పటికే వచ్చే ఏడాది వరకు అందుబాటులోకి రానున్న 13 ప్రముఖ కంపెనీలు అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్‌ డోసుల్లో సగానికి పైగా ముందే ఆర్డర్ చేసినట్లు జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్బెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు వెల్లడించారు. (చదవండి: వైద్యుడు కాదని వ్యాక్సిన్‌ను నమ్మలేదు.. కానీ)

ఇక కరోనా కట్టడి కోసం 100 శాతం సామార్థ్యం గల వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినా.. దాన్ని ప్రపంచ జనాభా అందరికి సరిపోయే మొత్తంలో ఉత్పత్తి చేసినప్పటికి 2022 వరకు ఐదొంతుల ప్రపంచ జనాభాకి వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాదని స్టడీ తెలిపింది. బీఎంజే మెడికల్‌ జర్నల్‌లో ప్రచురించిన ఈ నివేదిక నవంబర్‌ మధ్య వరకు లభించిన డాటా ఆధారంగా రూపొందించారు. ఇప్పటికే ఈ దేశాలు 7.48బిలియన్ల డోసులను రిజర్వ్‌ చేసుకున్నాయని నివేదిక తెలిపింది. ఎందుకంటే ప్రస్తుతం అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్‌లను రెండు డోసులు తీసుకోవాల్సి ఉండటంతో భారీగా వ్యాక్సిన్‌లను రిజర్వ్‌ చేసుకున్నాయి. ఇక 2021 చివరి వరకు ప్రపంచ వ్యాప్తంగా 5.96 బిలియన్ల వ్యాక్సిన్‌లు ఉత్పత్తి కానున్నాయి. 

Advertisement

తప్పక చదవండి

Advertisement