నా దుస్తులు అమ్మి అయినా ప్రజలకు చౌకగా గోధుమపిండి అందిస్తా!

30 May, 2022 14:49 IST|Sakshi

Pakistani Prime Minister Shehbaz Sharif given an ultimatum: వచ్చే 24 గంటల్లో 10 కిలోల గోధుమ పిండి బస్తా ధరను తగ్గించకుంటే తన బట్టలను అమ్మేస్తానని పాక్ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఖైబర్‌ ఫక్తున్‌ఖ్వా ముఖ్యమంత్రి మహమూద్‌ ఖాన్‌కి తన నిర్ణయాన్ని తెలిపారు. థకారా స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని షరీఫ్‌ ప్రసంగిస్తూ...నా దుస్తులు విక్రయించి అయిన ప్రజలకు తక్కువ ధరలో గోధుమ పిండి అందిస్తానని చెప్పారు. పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ దేశానికి నిరుద్యోగాన్ని, ద్రవ్యోల్బణాన్ని కానుకగా ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు.

దాదాపు ఐదు మిలయన్ల ఇళ్లు, 10 మిలయన్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోవడమే కాకుండా దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశారంటూ ఇమ్రాన్‌ ఖాన్‌పై విమర్శలు గుప్పించారు. తాను దేశ శ్రేయస్సు కోసం ప్రాణాలర్పించడమే కాకుండా అభివృద్ధి పథంలో ఉంచుతానని షరీఫ్‌ బహిరంగంగా ప్రకటించారు. బలూచిస్తాన్‌ ఎన్నికల గురించి మాట్లాడుతూ..ప్రజలకు తనపై విశ్వాసం ఉందని తనకు అనుకూలంగా ఓట్లు వేయడానికి పోలింగ్‌బూత్‌లకు తరలి వచ్చారని షరీఫ్‌ అన్నారు.

ఇది ‍ప్రజాస్వామ్యంపై ప్రజలకు గల నమ్మకాన్ని తెలియజేస్తుందన్నారు. ఇమ్రాన్‌ఖాన్‌ని ప్రజలు గద్ది దించుతారని గ్రహించే ఇంధన ధరలు తగ్గించారంటూ విమర్శించారు. అంతేకాదు షరీఫ్ తన సోదరుడు, పాక్‌ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై కూడా ప్రశంసలు కురిపించారు. ఆ సభలో పీఎంఎల్-ఎన్ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్ కూడా ప్రసంగించడమే కాకుండా తన తండ్రి నవాజ్‌ షరీఫ్‌పై ప్రశంసల వర్షం కురిపించింది.
(చదవండి: షాకింగ్‌ వీడియో: మోనాలిసా పెయింటింగ్‌ ధ్వంసానికి యత్నం! మారు వేషంలో వచ్చి మరీ..)

>
మరిన్ని వార్తలు