జీరో కోవిడ్‌ టాలరెన్సే లక్ష్యంగా... ఇంత పైశాచిక నిబంధనలా!!

13 Jan, 2022 10:33 IST|Sakshi

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి భారిన పడేసిన దేశంగా అపకీర్తిని మూటగట్టుకట్టుకున్న డ్రాగన్‌ దేశం..కరోనా కట్టడిలో భాగంగా ప్రజలపై పలు కఠినమైన ఆంక్షలు విధించి వారిని ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంది. మరోవైపు వచ్చే నెలలో జరగనున్న వింటర్‌ ఒలింపిక్స్‌ కల్లా జీరో కేసులే లక్ష్యంగా ఒక్కొక్క ప్రాంతాన్ని నిర్భందించుకుంటూ పోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరింత దారుణంగా పౌరులను కిక్కిరిసిన బాక్స్‌లో నిర్భంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

China has imposed several draconian rules: చైనా కరోనా కట్టడిలో భాగంగా పలు కఠిన ఆంక్షలు విధించుకుంటూ పోతుంది. మరోవైపు వచ్చే నెలల జరగనున్న వింటర్ ఒలింపిక్స్‌ ఆతిథ్యం ఇచ్చే నేపథ్యంలో ఆ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. జీరో కోవిడ్‌ విధానం అంటూ చైనా తన దేశంలో పౌరులపై క్రూరమైన నిబంధనలను అమలు చేసింది. ఇందులో భాగంగా మిలియన్ల మంది ప్రజలను కిక్కిరిసిన మెటల్‌ బాక్స్‌లలో నివశించేలా నిర్భంధించింది. అయితే వాటికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

ఆ వీడియోలో కరోనా సోకిన వారిని తీసుకువెళ్లేందుకు బస్సుల వరుసలు, మరోవైపు ప్రజలను నిర్భందించే మెటల్‌ బాక్స్‌ల వరుసలు కనిపించాయి. గర్భిణీ స్త్రీలు, పిల్లలు వృద్ధులతో సహా ప్రజలు, చెక్క మంచం, టాయిలెట్‌తో అమర్చబడిన ఈ కిక్కిరిసిన పెట్టెల్లో ఉండేలా బలవంతం చేస్తోంది. పైగా అనేక ప్రాంతాల్లో నివాసితులను అర్ధరాత్రి దాటిన తర్వాత తమ ఇళ్లను విడిచిపెట్టి, నిర్భంధ కేంద్రాలకు వెళ్లాలని పేర్కొంది. ఈ మేరకు చైనాలోని తమ ప్రజల కదిలికలను సైతం ట్రాక్-అండ్-ట్రేస్ యాప్‌ ద్వారా గుర్తించి మరీ నిర్భంధిస్తోంది.​ చైనాలో ఇప్పుడు దాదాపు 20 మిలియన్ల మంది ప్రజలు తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఆఖరికి ఆహారం కొనడానికి కూడా తమ ఇంటిని వదిలి వెళ్లకుండా నిషేధించారు.

మరిన్ని వార్తలు