విమానం గాల్లో ఉండగా ఊడిపోయిన డోర్‌.. వీడియో వైరల్‌ | Sakshi
Sakshi News home page

విమానం గాల్లో ఉండగా ఊడిపోయిన డోర్‌.. వీడియో వైరల్‌

Published Sat, Jan 6 2024 3:58 PM

Plane Door Blows Out Mid-Ai  Alaska Airlines temporarily grounds Boeing 737 9 - Sakshi

అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగా.. ఎయిర్‌క్రాఫ్ట్‌ డోర్‌ ఒక్కసారిగా ఊడిపోయింది. విమానం టేకాఫ్‌ అయిన కొన్ని నిమిషాలకే ఈ ప్రమాదం జరిగింది. 

అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737 మ్యాక్స్‌ 9(1282) విమానం పోర్టులాండ్‌ నుంచి ఒంటారియాకు(కెనడా) గురువారం సాయంత్రం బయలు దేరింది. 171 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో వెళ్తున్న ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ టేకాఫ్‌ అయిన కొంత సమయానికే మిడ్‌ క్యాబిన్‌ ఎగ్జిట్‌ డోర్‌ విమానం నుంచి పూర్తిగా విడిపోయింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయందోళనకు గురయ్యారు. వెంటనే గమనించిన పైలెట్.. విమానాన్ని తిరిగి పోర్ట్‌లాండ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించి సురక్షితంగా ల్యాండ్ చేశారు.

విమానం ఆకాశంలో ఉండగా డోర్‌ ఊడిపోయి సమయం దృశ్యాలను ప్రయాణికులు వీడియో తీయగా.. ప్రస్తుతం అవి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై అలస్కా ఎయిర్‌లైన్స్‌ స్పందించింది.  ఈ ఘటనతో ప్రభావితులైన ప్రయాణికులు, సిబ్బంది పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది.

ఇక ఈ సంఘటన అనంతరం  అలాస్కా ఎయిర్‌లైన్స్  బోయింగ్ 737 మ్యాక్స్‌ 9 విమానాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ‘ఫ్లైట్ 1282లో గురువారం రాత్రి జరిగిన పరిణామంతో మా బోయింగ్ 737-9కు సంబంధించిన 65 విమానాలను ముందు జాగ్రత్త చర్యలో భాగంగా తాత్కాలికంగా  నేలకు పరిమితం చేస్తున్నాం’ అని ఎయిర్‌లైన్సన్‌ సీఈవో బెన్స్‌ మినికుచి పేర్కొన్నారు.  పూర్తి మెయింటెనెన్స్, సేఫ్టీ తనిఖీల తర్వాత ప్రతి విమానం తిరిగి సేవలందించనున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement