Pakistan Foreign Policy Being Manipulated, PM Imran Khan Says - Sakshi
Sakshi News home page

PM Imran Khan: కొన్ని గంటల్లో అవిశ్వాస తీర్మానం.. ఇమ్రాన్‌ఖాన్‌ సంచలన ఆరోపణలు

Published Mon, Mar 28 2022 8:12 AM

PM Imran Khan Said Pakistan Foreign Policy Being Manipulated - Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం పాక్‌ అసెంబ్లీలో ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొబోతోంది. కాగా, ఇప్పటికే ఇమ్రాన్‌కు సొంత పార్టీ ఎంపీలు, మిత్రపక్షాల నేతలు కీలక సమయంలో హ్యాండ్‌ ఇచ్చారు.

అయితే, అవిశ్వాసం నేపథ‍్యంలో ఆదివారం ఇస‍్లామాబాద్‌లో ఇమ్రాన్‌ఖాన్‌ భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో వేలాది మంది మద్దతుదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇమ్రాన్‌ మాట్లాడుతూ.. దేశంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు విదేశీ శక్తుల ప్రమేయం ఉందన్నారు. విదేశీ శక్తుల డబ్బుతో ఇక్కడి రాజకీయ నాయకులనే వినియోగించి పాక్‌ విదేశాంగ విధానాన్నే మార్చాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇందుకు సాక్ష్యంగా తన వద్ద ఓ లేఖ ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశాల నుంచి వచ్చే డబ్బుతోనే పాక్‌లో ప్రభుత్వాన్ని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఆ డబ్బు అందుకున్న నాయకులు విదేశీ ఖాతాలకు డబ్బు బదీలీ చేస్తున్నారు. నా ప్రభుత్వం కొనసాగినా, పడిపోయినా.. తాను ప్రాణాలతో ఉన్నా లేకున్నా అలాంటి దేశదోహ్రులను విడిచిపెట్టాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  

ఈ క్రమంలోనే ముగ్గురు తొత్తులు దేశాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. గత 30 ఏళ్లుగా మూడు పందికొక్కులు దేశాన్ని దోచుకుంటున్నాయని పాక్‌ మాజీ ప్రధానులపై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు గుప్పించారు. వైట్‌కాలర్‌ నేరగాళ్ల కారణంగా పాకిస్థాన్‌ ఇంకా పేదరికంలోనే ఉందని ఇమ్రాన్‌ఖాన్‌ పేర్కొన్నారు. ముషారఫ్ లాగా ఇమ్రాన్ ఖాన్ కూడా లొంగిపోవాలని ఈ డ్రామా అంతా చేస్తున్నారని విమర్శించారు. వారు తమ ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. మరోవైపు ఈ ర్యాలీపై పాక్‌ ప్రతిపక్ష పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) నేతలు.. ఇమ్రాన్‌ఖాన్‌ అవిశ్వాస తీర్మానం నుంచి తప్పించుకునేందుకు ఇస్లామాబాద్ వీధుల్లో రక్తపాతం చేయడానికి కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement