PPP Worst Fraud In History: $200B stolen And Blown On Lamborghinis, Beach Houses And Bling - Sakshi
Sakshi News home page

America PPP Fraud: ప్రపంచంలోనే అత్యంత ఘరానా మోసం.. అమెరికా సర్కార్‌కే షాక్‌!

Published Sun, Jul 16 2023 8:11 AM

ppp fraud is worst in history stolen splurged on lamborghinis - Sakshi

ప్రపంచంలో జరిగే మోసాలకు అంతేలేకుండా పోతోంది. అమెరికాలో కరోనా కాలంలో జరిగిన ఒక మోసాన్ని అత్యంత ఘరానా మోసంగా చెబుతుంటారు. పేచెక్‌ ప్రొటెక్షన్‌ ప్రోగ్రాం(పీపీపీ) లోన్ సిస్టమ్‌ను ఆధారంగా చేసుకుని $200 బిలియన్లను దక్కించుకుని, దానితో లంబోర్ఘినిలు, వెకేషన్ హోమ్‌లు, ప్రైవేట్ జెట్ ఫ్లైట్‌లు, కార్టియర్ ఆభరణాలు కొనుగోలు చేసి, వేలాది మంది మోసగాళ్లు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు. మహమ్మారి సమయంలో అందించిన కోవిడ్ లోన్ స్కీమ్‌ను వారు అక్రమంగా దక్కించుకుని అవినీతికి పాల్పడ్డారు 

$200 బిలియన్ల మేరకు ఫ్రాడ్‌
2020,2021లో అమెరికా ప్రభుత్వం దాదాపు $1.2 ట్రిలియన్‌ మొత్తాన్ని వివిధ వ్యాపారాల కోసం కోవిడ్‌ బెయిలౌట్ నగదు కింద కేటాయించింది. ఆర్థిక విపత్తు లోన్ ప్రోగ్రామ్ (ఈఐడీఎల్‌పీ), పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ (పీపీపీ) స్కీమ్‌ల కోసం ఈ నిధులను ఖర్చు చేశారు. అయితే దీనికి సంబంధించిన స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఆఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్(ఎస్‌బీఏ) నుండి వచ్చిన ఒక నివేదిక ఆశ్చర్యపరిచే విధంగా ఉంది. దీనిలో 17% నిధులు దుర్వినియోగం అయ్యాయని తేలింది. అంటే 200 బిలియన్‌ డాలర్ల (దాదాపు 16 లక్షల 40 వేల కోట్లు) మేరకు ఫ్రాడ్‌ జరిగింది.
 
అక్రమంగా మిలియన్ల డాలర్ల లోన్‌ తీసుకుని..
ఈ మోసపూరిత వ్యవహారంలో 90,000కు మించిన యాక్టివ్‌ లీడ్‌లు ఉన్నాయని ఎస్‌బీఏ అంచనా వేసింది. ఈ ఉదంతంలో ఎస్‌బీఏ ఇప్పటికే మాజీ న్యూయార్క్ జెట్స్ వైడ్ రిసీవర్, జోష్ బెల్లామీతో సహా పలువురిని విచారణ చేసింది. ఈ జాబితాలో మాన్‌హాటన్ థీమ్ రెస్టారెంట్ జెకిల్ అండ్‌ హైడ్ యజమాని డోనాల్డ్ ఫిన్లీ ఉన్నారు. ఈయన పీపీపీ,ఈఐడీఎల్‌పీ సాయంతో మిలియన్ల డాలర్ల లోన్‌ తీసుకుని వాటర్‌ఫ్రంట్ వీక్షణ కలిగిన డయోనిస్ బీచ్‌లో నాన్‌టుకెట్ ఇంటిని కొనుగోలు చేశాడు. ప్రస్తుతం మాన్‌హాటన్ థీమ్ రెస్టారెంట్ జెకిల్ అండ్‌ హైడ్ మూతబడింది. ఈ ఘరానా మోసానికి పాల్పడిన ఫిన్లీ 30 సంవత్సరాల జైలు శిక్షను ఎదుర్కొననున్నాడు. అలాగే $3.2 మిలియన్ల మొత్తాన్ని తిరిగి చెల్లించవలసి ఉంటుంది. దీనికితోడు ఆయనపై $1.25 మిలియన్ల మేరకు జరిమానా కూడా విధించారు. 

మే 2023 నాటికి మొత్తం 803 అరెస్టులు
అక్రమంగా నగదును పొందేందుకు మోసగాళ్లు నకిలీ వ్యాపారాలను సృష్టించారని లేదా వారి ఉద్యోగుల సంఖ్య గురించి అబద్ధాలు చెప్పారని లెక్సిస్‌ నెక్సిస్‌ రిస్క్ సొల్యూషన్స్ ప్రతినిధి హేవుడ్ టాల్కోవ్ ది పోస్ట్‌కు తెలిపారు. మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో రోల్స్ రాయిస్ లేదా హై-ఎండ్ మెర్సిడెస్ వంటి కార్లను కొనుగోలు చేయడం చాలా కష్టమని భావించిన ఈ మోసగాళ్లు పీపీపీ ప్రోగ్రాంను అక్రమంగా వినియోగించుకున్నారని మరో అధికారి టాల్కోవ్ చెప్పారు.మహమ్మారి కాలంలో జరిగిన ఈ మోసానికి సంబంధించి మే 2023 నాటికి మొత్తం 803 అరెస్టులు జరిగాయని ఎస్‌బీఏ తెలిపింది. 
ఇది కూడా చదవండి: గూగుల్‌ మ్యాప్‌ను వినియోగిస్తూ.. ఆ గొంతు తెలియదంటే ఎలా?



అత్యంత ఖరీదైన కార్ల కొనుగోలుకు..
పీపీపీ ‍ప్రోగ్రాంను ఫ్లోరిడాకు చెందిన డేవిడ్ హైన్స్(29) అక్రమంగా వినియోగించుకుని $3.9 మిలియన్ల మొత్తాన్ని పొంది, అత్యంత విలువైన లంబోర్ఘిని హురాకాన్ ఎవో స్పోర్ట్స్ కారును కొనుగోలు చేశాడు. అధికారులు ఇతని దగ్గర నుంచి స్పోర్ట్స్ కారును స్వాధీనం చేసుకోవడంతోపాటు, అతని బ్యాంకు ఖాతాల నుండి $3.4 మిలియన్ల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారుల ముందు హైన్స్ తన నేరాన్ని అంగీకరించాడు. అతను హై-ఎండ్ దుకాణాలు, మయామి హోటల్లో అత్యధికంగా నిధులు ఖర్చుపెట్టాడు. తల్లికి $30,000 పన్నుచెల్లింపుదారుల నగదును పంపినట్లు అతని రికార్డులు చూపిస్తున్నాయి.

ఫెడరల్ జైలులో గరిష్టంగా 30 సంవత్సరాల పెనాల్టీ
జాక్సన్‌విల్లే తన ఇంటి, వ్యాపార ఆస్తి తనఖాను చెల్లించడానికి మొత్తం $910,000 పీపీపీ నిధులను అక్రమంగా ఉపయోగించాడు. ఆ తర్వాత తన నేరాన్ని అంగీకరించారు. జాక్సన్‌విల్లే ఈ నిధులతో 18-క్యారెట్ బంగారు రోలెక్స్ వాచ్, పాతకాలపు జాగ్వార్ ఎక్స్‌కే-ఈ, ఈ-టైప్, రోడ్‌స్టర్‌ను కొనుగోలు చేశాడు. అతను అందుకున్న పీపీపీ రుణాల ఆధారంగా నగదు ఉపసంహరణ ద్వారా $113,000 మొత్తాన్ని అందుకున్నాడు. కాగా ల్యాండర్లు ఫెడరల్ జైలులో గరిష్టంగా 30 సంవత్సరాల పెనాల్టీని ఎదుర్కొనబోతున్నారు. జార్జియాకు చెందిన డారెల్ థామస్‌కు పీపీపీ నిధులను వినియోగించి మెర్సిడీస్‌ బెంజ్‌ ఎస్‌-క్లాస్, ఒక ల్యాండ్ రోవర్,ఒక గోల్డ్ రోలెక్స్‌తో పాటు అకురా ఎన్‌ఎస్‌ఎక్స్‌ కోసం ఖర్చు చేసినందుకు 15 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.

డిజైనర్ నగలు, దుస్తుల కోసం ఖర్చు చేసి..
పీపీపీ నుండి $11.1 మిలియన్లు దక్కించుకునేందుకు 14 మోసపూరిత రుణాలను పొందానని బ్యాంకును మోసగించానని, మనీ లాండరింగ్‌కు పాల్పడ్డానని థామస్ నేరాన్ని అంగీకరించాడు. ఇదేవిధంగా రెస్టారెంట్ స్కామర్ మాన్‌హట్టన్ తన రెస్టారేటర్ బెసిమ్ కుకాజ్ రెస్టారెంట్ గ్రూప్‌ కోసం బోగస్ లోన్‌ల పేరిట $6.1 మిలియన్లను మోసగించినట్లు వెల్లడైంది. అతను నిర్వహిస్తున్న ఇంటర్‌మెజో, లిమోన్ జంగిల్, కారా మియాలు ఇప్పుడు మూతబడ్డాయి. మాన్‌హట్టన్ డిజైనర్ నగలు, దుస్తుల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేసినట్లు విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. 
ఇది కూడా చదవండి: వీరు విమాన ​‍ప్రయాణికులేనా.. పెరుగుతున్న ఫిర్యాదుల పరంపర

బెయిల్‌పై విడుదలైన తర్వాత కూడా..
మాన్‌హట్టన్ అత్యాశతోనే ఇదంతా చేశాడని, ఈ డబ్బులో కొంత భాగాన్ని ఫ్లోరిడా రియల్ ఎస్టేట్ డెవలపర్‌కు పంపాడు. కార్టియర్, హ్యూగో బాస్ నుండి విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఉపయోగించాడని న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్ న్యాయవాది డామియన్ విలియమ్స్ అన్నారు. ఈ మోసగాడు అరెస్టు అయి, బెయిల్‌పై విడుదలైన తర్వాత కూడా మహమ్మారి సహాయాన్ని అందుకున్నాడని ప్రాసిక్యూటర్ చెప్పారు. ఈ నేపధ్యంలో ఆయన న్యూజెర్సీలోని ఫోర్ట్ డిక్స్ ఫెడరల్ జైలులో ఆరు సంవత్సరాల ఎనిమిది నెలల శిక్షను అనుభవిస్తున్నాడు.



విలాసవంతమైన ప్రయాణాల కోసం..
ప్లాస్టిక్ సర్జరీతో పాటు విలాసవంతమైన ప్రయాణం చేసేందుకు టేనస్సీలోని సర్గోయిన్స్‌విల్లేకు చెందిన లెస్లీ బెథియా, 2021లో మోసపూరితంగా $20,805 రుణం పొందింది. ఈ నేపధ్యంలో ఆమెకు 78 నెలల జైలు శిక్ష విధించారు. ఫ్లోరిడాలోని సన్నీ ఐల్స్ బీచ్‌లోని ఒక రిసార్ట్‌లో ఐదు రోజులు గడిపేందుకు ఆమె స్కామ్ చేసిన నగదును ఉపయోగించింది. ఆమె తన ఈ పర్యటనలో ప్లాస్టిక్ సర్జరీకి చెల్లించడానికి కూడా పెద్ద మొత్తంలో చెల్లింపులు చేసింది. ఇదేవిధంగా హ్యూస్టన్‌కు చెందిన స్కాట్ జాక్సన్ డేవిస్‌ను ఈ కేసులో జైలుకు తరలించారు. అతను మూడు నకిలీ వ్యాపారాల కోసం పీపీపీ రుణాలను మోసపూరితంగా అందుకున్నాడు. అతను $3.3 మిలియన్లను తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

తప్పుడు పత్రాలు, తప్పుడు సమాచారంతో..
మాజీ ఎన్‌ఎఫ్‌ఎల్‌ ఆటగాడు జోష్ బెల్లామీ తప్పుడు పత్రాలు, తప్పుడు సమాచారాన్ని ఉపయోగించి 2021లో తన కంపెనీ డ్రిప్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌సీ కోసం $1.2 మిలియన్ రుణాన్ని అక్రమంగా పొందాడు. బెల్లామీ ఈ మొత్తాన్ని నగల కొనుగోలుతో పాటు సెమినోల్ హార్డ్ రాక్ హోటల్, క్యాసినోలో బస చేయడానికి ఉపయోగించినట్లు అంగీకరించాడు. ఈ నేరంలో సహ-కుట్రదారుకు $311,000కు మించిన మొత్తాన్ని ఖర్చు చేశాడని విచారణతో తేలింది. 

పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అంటే..
పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ (పీపీపీ) అనేది 2020లో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ పరిపాలనలో యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టిన పథకం. ఇది కరోనావైరస్ ఎయిడ్, రిలీఫ్, ఎకనామిక్ సెక్యూరిటీ యాక్ట్ (కేర్స్ యాక్ట్) ద్వారా కొన్ని వ్యాపారాలకు సహాయం అందించేందుకు ఏర్పాటుచేసిన $953-బిలియన్ల విలువైన వ్యాపార రుణ కార్యక్రమం. పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్.. సంస్థాగత ఖర్చులు చెల్లించడానికి తక్కువ వడ్డీతో కూడిన రుణాల కోసం వివిధ కంపెనీలకు అనుమతి కల్పిస్తుంది. పీపీపీ లోన్  అనేది దరఖాస్తుదారు చెల్లించే సగటు నెలవారీ పేరోల్ ఖర్చుల కంటే దాదాపు 2.5 రెట్లు అధికంగా ఉంటుంది. దీనిలో కొన్నిసార్లు దరఖాస్తుదారు సాధారణంగా మొదటి డ్రాతో సమానంగా రెండవ డ్రాను కూడా అందుకోవచ్చు. ఈ రుణం పేరోల్ ఖర్చులు, అద్దె, వడ్డీ, యుటిలిటీలను కవర్ చేయడానికి అందిస్తారు. 
ఇది కూడా చదవండి: ఎరక్కపోయి వచ్చి ఎలుగుబంటి కంట్లో పడ్డాం.. పరుగో పరుగు

Advertisement
Advertisement