Russian Army Sabotaging Own Vehicles To Avoid Ukraine War - Sakshi
Sakshi News home page

Russia-Ukraine war: కన్నీరు పెడుతున్న రష్యా బలగాలు.. కారణం ఏమిటీ..? 

Published Thu, Mar 3 2022 10:33 AM

Russian Army Sabotaging Own Vehicles In Ukraine War - Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రష్యా బాంబుల దాడి కారణంగా ఉక్రెయిన్‌ పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలు నగరాలపై బాంబుల వర్షం కురిపించిన రష్యా సైన‍్యం.. తాజాగా మరో ప్రధాన నగరమైన ఖేర్సన్‌ను గురువారం ఉదయం స‍్వాధీనం చేసుకుంది. ఈ మేరకు ఉక్రెయిన్ అధికారులు సైతం ధ్రువీకరించినట్టు ఏఎఫ్‌పీ న్యూస్‌ ఏజెన్సీ ట‍్విట్టర్‌ ఖాతాలో పేర్కొంది. 

కాగా, ఉక్రెయిన్‌కు ఖేర్సన్‌ నల్లసముద్రంలో వ్యూహాత్మంగా ఎంతో ప్రా‍ముఖ్యత ఉన్న పోర్టు సిటీ. మరోవైపు కీవ్‌ను స్వాధీనం చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో రష్యా బలగాలు ముందుకు సాగుతుండగా ఉక్రెయిన్‌ సైన్యం ఎదురుదాడి చేస్తోంది. దీంతో వారి మధ్య భీకరపోరు నడుస్తోంది. కీవ్​ లక్ష్యంగా దూసుకెళ్తున్న రష్యా సైన్యం స్థానిక మెట్రోస్టేషన్​ సమీపంలో భారీ పేలుళ్లకు పాల్పడింది. మరోవైపు, గురువారం ఉదయం కీవ్​లోని డ్రుజ్బీ నరోదివ్​ మెట్రో స్టేషన్​ సమీపంలో రెండు పేలుడు ఘటనలు జరిగినట్లు స్థానిక వార్తా సంస్థ తెలిపింది. 

ఇదిలా ఉండగా.. యుద్దం వేళ మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రష్యా సైనికులు అక్కడ తమ సొంత యుద్ధ వాహనాలను ధ్వంసం చేస్తున్నట్టు ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ ఓ కథనాన్ని ప్రచురించింది. ఉక్రెయిన్‌ ప్రజలపై తూటాలు కురిపించడం ఇష్టంలేక చాలామంది రష్యన్‌ సైనికులు కన్నీరు పెట్టుకుంటున్నారని పేర్కొంది. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని తప్పించేందుకు తమ వంతు సాయంగా వారి వాహనాలను వారే దగ్ధం చేసుకుంటున్నట్టు వివరించింది. కాగా, రష్యా సైనికుల్లో చాలామంది యువతే ఉన్నారు. వీరికి యుద్దంపై తగినంత శిక్షణ ఇవ్వకపోవడంతో యుద్ధానికి సన్నద్ధం కాలేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆహారం లేక అలమటిస్తున్నారు. వాహనాలకు సరిపడా ఇంధనం కూడా వారి దగ్గర లేదు. యుద్ధాన్ని నివారించే ఉద్దేశంతో తమ వాహనాలను ధ్వంసం చేస్తున్నారని పేర్కొంది.

ఇది చదవండి: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం: మనోళ్లే రక్షణ కవచాలు! సైన్యం చేతిలో బంధీలుగా భారత విద్యార్థులు??

Advertisement
Advertisement