ఐన్‌స్టీన్‌ను మించిన తెలివున్నా.. ఆమెకు తీరని ఆవేదన? | Sakshi
Sakshi News home page

England: ఐన్‌స్టీన్‌ను మించిన తెలివున్నా.. ఆమెకు తీరని ఆవేదన?

Published Tue, Feb 13 2024 11:01 AM

Student Gifted Pupils Admits Teachers Struggle - Sakshi

ఆ అమ్మాయి.. ప్రముఖ శాస్త్రవేత్తలు ఐన్‌స్టీన్‌, స్టీఫెన్‌ హాకింగ్స్‌కు మించిన తెలివితేటలు కలిగినది. ఆమె ఐక్యూ 161 పాయింట్లు. ఇంతటి ‍ప్రతిభావంతురాలైన ఆమెకు చదువు చెప్పలేక ఉపాధ్యాయులే సతమతమవుతున్నారట.

ఇంగ్లండ్‌లోని స్లోఫ్‌కు చెందిన మహ్నూర్‌ చీమా(17)తన తొమ్మిదేళ్ల వయసులో పాకిస్తాన్ నుంచి కుటుంబంతోపాటు బ్రిటన్‌కు వచ్చింది. ఈ సమయంలో ఆ చిన్నారి తన ‍ప్రతిభను  చూపినప్పటికీ ఉపాధ్యాయులు పైతరగతికి ప్రమోట్‌ చేయలేదు. బెర్క్‌షైర్‌లోని కోల్న్‌బ్రూక్ చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ ప్రైమరీ స్కూల్‌ ఉపాధ్యాయులు తాను క్లాస్ వర్క్‌ను అందరికన్నా త్వరగా పూర్తి చేసినప్పటికీ, పై క్లాస్‌కు వెళ్లేందుకు అనుమతించలేదని, పైగా అదనంగా గణితాన్ని అభ్యసించాలని ఆదేశించారని చీమా తెలిపింది. 
  
ఆమె లాంగ్లీ గ్రామర్ స్కూల్‌కి మారినప్పుడు, జీసీఎస్‌ఈ పరీక్షలకు కూర్చోకుండా  నిరుత్సాహపరిచారని చీమా ఆరోపించింది. అయితే చీమాపై ఒత్తిడి అధికంగా ఉందని, దానికి గుర్తుగా ఆమె కళ్లకింద నల్లని వలయాలు  ఏర్పడ్డాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అయితే ఆమె తల్లిదండ్రులు తమ చిన్నారి తెలివితేటలకు తగిన విద్యను అందించేందుకే యూకే వచ్చామని తెలిపారు. 

మహ్నూర్‌ చీమా మీడియాతో మాట్లాడుతూ తన మాదిరిగా ప్రతిభ కలిగిన చాలామంది విద్యార్థులు ఉన్నారని, అయితే వారి సామర్థ్యాన్ని ఎవరూ గుర్తించడం లేదని, ఫలితంగా వారి ప్రతిభ వృథా అవుతున్నదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాను ప్రతిభావంతులైన పలువురు విద్యార్థులతో మాట్లాడానని, వారు కూడా తనలానే నిరాశతో ఉన్నారని అమె పేర్కొంది. 

ప్రతిభావంతులైన విద్యార్థులకు చేయూతనందించాల్సిన బాధ్యత విద్యాసంస్థలపై ఉందని, బ్రిటీష్ విద్యావ్యవస్థలో గణిత బోధన చాలా నెమ్మదిగా సాగుతున్నదని, బ్రిటన్‌లోని 11 ఏళ్ల విద్యార్థులకు నిర్వహించే పరీక్షలను పాకిస్తాన్‌లో మూడవ సంవత్సరం పిల్లలు పూర్తి చేయగలరని చీమా వ్యాఖ్యానించింది.

చీమా తన జీసీఎస్‌ఈలో 33 నైన్‌లు సాధించింది. ఇది అత్యధిక స్కోర్. అలాగే తాను ఉంటున్న ప్రాంత పరిధిలోని పలు పాఠశాలల ప్రవేశ పరీక్షలకు హాజరై, మూడు కౌంటీలలో అగ్రస్థానంలో నిలిచింది. చీమా కుటుంబం పాకిస్తాన్‌లోని లాహోర్ నుండి 2006లో యూకేకి తరలివచ్చింది - ఆమె తండ్రి, ప్రముఖ న్యాయవాది. తల్లి ఆర్థికశాస్త్రంలో రెండు డిగ్రీలు సాధించారు. జాతీయ గణిత ఛాంపియన్‌గా నిలిచిన 14 ఏళ్ల సోదరి కూడా ఆమెకు ఉంది. ప్రస్తుతం చీమా..హెన్రిట్టా బార్నెట్ స్కూల్‌లో విద్యనభ్యసిస్తోంది. చీమాకు స్విమ్మింగ్‌తో పాటు గుర్రపు స్వారీ చేయడమంటే కూడా ఎంతో ఇష్టం. 

Advertisement

తప్పక చదవండి

Advertisement