Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌ | Sakshi
Sakshi News home page

Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

Published Thu, Apr 21 2022 9:51 AM

Top 10 Telugu Latest Current News Morning Headlines Today 21th April 2022 - Sakshi


ప్రాధాన్యం సంతరించుకున్న బోరిస్‌ జాన్సన్‌ భారత్‌ పర్యటన

ఇంగ్లండ్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రెండు రోజుల పర్యటన కోసం గురువారం భారత్‌కు వస్తున్నారు. ఇంగ్లండ్‌ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన నేరుగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ చేరుకుంటారు.

గుజరాత్‌ ఎమ్మెల్యే అరెస్ట్‌
గుజరాత్‌ ఎమ్మెల్యే, దళిత నాయకుడు జిగ్నేష్‌ మేవానీని అస్సాం పోలీసులు అరెస్ట్‌ చేశారు. బనస్కాంత జిల్లాలోని పాలన్‌పూర్‌ సర్క్యూట్‌ హౌజ్‌ వద్ద బుధవారం రాత్రి 11.30 నిమిషాలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

తూర్పుగోదావరిలో సీఎం జగన్‌ పర్యటన
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. బిక్కవోలు మండలం బలభద్రపురంలో బిర్లా గ్రూప్‌ కాస్టిక్‌ సోడా యూనిట్‌ను ప్రారంభిస్తారు.

ఆ కోర్సులకు గిరాకీ.. ‘డిగ్రీ’ వైపు మళ్లీ చూపు..
డిగ్రీ కోర్సులకు మళ్లీ గిరాకీ పెరుగుతోంది. కొన్నేళ్లుగా ఇంజినీరింగ్‌ కోర్సుల వైపు విద్యార్థులు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. కానీ డిగ్రీ కోర్సులు చేసినా ఉద్యోగావకాశాలు సొంతం చేసుకోవచ్చుననే ఆత్మవిశ్వాసం విద్యార్థుల్లో కనిపిస్తోంది.

పీసీసీలో ‘పీకే’ ఫీవర్‌! అలా అయితే ఎలా?
రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే) టెన్షన్‌ పట్టుకుంది. ఎన్నికల వ్యూహకర్తగా పేరు గడించిన ఆయన.. కాంగ్రెస్‌ శిబిరం లోకి వస్తుండటం, మరోవైపు తెలంగాణలో టీఆర్‌ ఎస్‌ పక్షాన పనిచేస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

మీ వాహనంపై 3 చలాన్ల కంటే ఎక్కువ ఉన్నాయా.. ఇక అంతే!
46 రోజుల పాటు అందుబాటులో ఉన్న పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్లపై రిబేట్‌ అవకాశాన్ని మీరు వినియోగించుకోలేదా? మీ వాహనంపై మూడు కంటే ఎక్కువ చలాన్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయా? అయితే ట్రాఫిక్‌ పోలీసులు ఎప్పుడైనా సరే నడి రోడ్డు మీదే మీ వాహనాన్ని ఆపేస్తారు.

పొలార్డ్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై
వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు పొలార్డ్ బుధ‌వారం రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. దీంతో.. ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు.

ప్రముఖ దర్శకుడు మారుతికి పితృవియోగం
ప్రముఖ దర్శకుడు మారుతి ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి దాసరి వన కుచలరావు(76) కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని స్వగృహంనందు గురువారం తుదిశ్వాస విడిచారు. దీంతో మారుతి ఇంట విషాదఛాయలు నెలకొన్నాయి.

రష్యాలో వ్యాపారానికి టాటా స్టీల్‌ గుడ్‌బై 
రష్యాతో వ్యాపార కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు టాటా స్టీల్‌ ప్రకటించింది. ‘‘టాటా స్టీల్‌కు రష్యాలో ఎటువంటి కార్యకలాపాలు కానీ, ఉద్యోగులు కానీ లేరు. దీంతో రష్యాతో వ్యాపారం చేయకూడదని నిర్ణయం తీసుకున్నాం’’ అంటూ టాటా స్టీల్‌ ప్రకటన విడుదల చేసింది.

సత్వర పరిష్కార దిశ
ఆడపిల్ల పుడితే... అదృష్టం పుట్టిందని సంబరపడాలి. ఆడపిల్ల పెరుగుతుంటే... ఆ ఇంట్లో ఆనందం వెల్లి విరియాలి. ఆడపిల్ల ఆ ఇంటికి సంతోషం... ఆ ఇంటి వేడుకల కల్పవల్లి. ఆ సంతోషం... ఆనందం... అదృశ్యమై ఆందోళన రాజ్యమేలుతుందా? ఆడపిల్ల అమ్మానాన్నల గుండె ఆందోళనతో కొట్టుకుంటే ఆ తప్పెవరిది? 

Advertisement

తప్పక చదవండి

Advertisement