Ukraine Russia War Updates: Ukraine Announced Viktor Medvedchuk Offer To Russia - Sakshi
Sakshi News home page

యుద్ధం వేళ మరో ట్విస్ట్‌.. పుతిన్‌కు అతడి ఫొటో పంపిన జెలెన్‌ స్కీ

Published Wed, Apr 13 2022 4:17 PM

Ukraine Announced Viktor Medvedchuk Offer To Russia - Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు దాడులు కొనసాగుతున్నాయి. బాంబు దాడులతో ఓడరేవు నగరం మరియుపోల్‌లో రష్యా మారణహోమం సృష్టిస్తోంది. రష్యా బాంబు దాడుల్లో వేల సంఖ్యలో ఉక్రెయిన్‌ పౌరులు మృతి చెందారు. వేల సంఖ్యలో ఉక్రేనియన్లను రష్యా ఆర్మీ బంధీలుగా చేసుకుంది. 

ఇదిలా ఉండగా, రష్యా వ్యాపార‌, రాజ‌కీయ‌వేత్త విక్టర్ మెద్వెచ‌క్‌ను ఉక్రెయిన్ అరెస్టు చేసింది. ఉక్రెయిన్ మిలిట‌రీ దుస్తులు ధ‌రించి.. చేతుల‌కు బేడీలతో ఉన్న మెద్వెచ‌క్ ఫొటోను ఉక్రెయిన్‌ అధికారులు రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ.. పుతిన్‌కు ఓ ఆఫర్‌ ఇచ్చారు. మెద్వెచ‌క్‌ను తీసుకుని, రష్యా బలగాల వద్ద బంధీలుగా ఉన్న ఉక్రెయిన్‌ దేశ పౌరుల(అమ్మాయిలు, అబ్బాయిలు)ను విడుద‌ల చేయాల‌ని జెలెన్‌ స్కీ కోరారు.

అయితే, విక్టర్ మెద్వెచ‌క్‌.. రష్యాకు చెందిన వ్యాపారవేత్త, పుతిన్‌లో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నారు. కాగా, కొన్నాళ్ల పాటు మిద్వెచక్‌.. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో గృహ నిర్బంధంలో ఉన్నారు. రష్యా దాడులు, ఉక్రెయిన్‌ ఆక్రమణ తర్వాత ఆయన అదృశ్యమయ్యారు. దాడులు జరుగుతున్న క్రమంలో అతడిని ఉక్రెయిన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో రష్యాతో యుద్ధం వేళ అతడితో సత్సంబంధాలను కొనసాగిస్తూ ఇలా పుతిన్‌కు ఆఫర్‌ ఇచ్చింది. 

ఇది చదవండి: భారత్‌కు బిగ్‌ రిలీఫ్‌.. మోదీకి గ్రీన్‌సిగ్నల్‌

Advertisement
Advertisement