2 వేల మంది చిన్నారులను కిడ్నాప్‌ చేసిన రష్యా: ఉక్రెయిన్‌ | Sakshi
Sakshi News home page

2 వేల మంది చిన్నారులను కిడ్నాప్‌ చేసిన రష్యా: ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ

Published Mon, Mar 21 2022 8:38 PM

Ukraine Foreign Ministry Says Over Several Children Kidnapped By Russia - Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు దాడులను రోజురోజుకు పెంచుకుంటూ వెళ్లుతున్నాయి. ఉక్రెయిన్‌లో విధ్వంసమే లక్ష్యంగా పెట్టుకున్న రష్యా..  బాంబలు వర్షం కురిపిస్తోంది. కొన్ని చోట్ల ఉక్రెయిన్‌ సామాన్య ప్రజలు రష్యా సైన్యానికి ఎదురునిలిచి దాడులు ఆపాలని నిరసనలు తెలుపుతున్నా తగ్గడం లేదు. తాజాగా ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ సంచలన వ్యాఖ్యలు చేసింది. సుమారు 2,389 మంది ఉక్రెయిన్‌ దేశ చిన్నారులను రష్యా కిడ్నాప్‌ చేసినట్లు పేర్కొంది. చట్టవిరుద్ధంగా తమ దేశ చిన్నారులను అపహరించినట్లు వెల్లడించింది.

రష్యా ఆక్రమించిన డాన్‌బాస్ ప్రాంతంతో సుమారు 2వేల మంది చిన్న పిల్లలు కనిపంచడం లేదని.. వారిని రష్యానే కిడ్నాప్‌ చేసిందని ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ పేర్కొంది. మరోవైపు ఓడరేవు నగరమైన మారియుపోల్‌ను చుట్టుముట్టామని, అక్కడ ఉన్న ఉక్రెయిన్‌ బలగాలు లొంగిపోవాలన్న రష్యా డిమాండ్‌ను ఉక్రెయిన్‌ అధికారులు తిరస్కరించారు.

మారియుపోల్‌లో ఆదివారం సుమారు 400 మంది తలదాచుకుంటున్న ఓ ఆర్ట్‌ స్కూల్‌పై రష్యా బలగాలు దారుణంగా బాంబలు కురిపించిన విషయం తెలిసిందే. అందులోంచి 150 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చామని ఉక్రెయిన్‌ అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement