Ukraine-Russia War: Ukraine President Zelensky Thanks to PM Modi in a Tweet - Sakshi
Sakshi News home page

Ukraine Crisis: ప్రధాని మోదీకి థ్యాంక్స్‌ చెప్పిన జెలెన్‌స్కీ.. ఎందుకంటే

Published Mon, Mar 7 2022 4:24 PM

Ukraine President Zelensky Thanks PM Modi In A Tweet - Sakshi

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలిపారు. రష్యా దురాక్రమణను ఉక్రెయిన్ ధీటుగా ఎలా ఎదుర్కొంటుందో ప్రధాని నరేంద్రమోదీకి వివరించినట్లు చెప్పారు. యుద్ధ సమయంలో అత్యున్నత స్థాయిలో శాంతియుత సంభాషణలు చేసినందుకు, తమ దేశ పౌరులకు చేసిన సహాయంపై భారత్ ఉక్రెయిన్‌ను ప్రశంసించిందని పేర్కొన్నారు. అయితే రష్యా బలగాలను ఉక్రెయిన్ సమర్ధవంతంగా ఎదుర్కొంటున్న విధానాన్ని మోదీ ప్రశంసించారని పేర్కొన్నారు. ఉక్రెయిన్ ప్రజలకు మద్దతుగా నిలిచినందుకు మోదీకి  జెలెన్‌స్కీ ధన్యవాదాలు తెలిపారు.
చదవండి: రష్యాతో స్నేహం ధృడంగా ఉంది. అందుకు సిద్ధంగా ఉన్నాం: చైనా

ఈ మేరకు సోమవారం నరేంద్రమోదీతో 35 నిమిషాల పాటు ఫోన్‌లో ఆయన మాట్లాడారు. అనంతరం జెలెన్‌ స్కీ తన అధికారిక ట్విట్టర్ ద్వారా మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ట్వీట్ చివర్లో ‘స్టాప్ రష్యా’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని చేర్చారు. మరోవైపు ఉక్రెయిన్‌-రష్యా ప్రతినిధుల మధ్య సోమవారం మూడో విడత శాంతి చర్చలు జరగనున్నాయి. ఈ క్రమంలో రష్యా ప్రతినిధు బృంధం నేడు బెలారస్‌కు చేరుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. 
చదవండి: War Updates: ఉక్రెయిన్‌ సంక్షోభంపై ఐసీజేలో విచారణ..

<

Advertisement

తప్పక చదవండి

Advertisement