ఉత్కంఠ రేపుతున్న రష్యా విక్టరీ డే.. జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు!

8 May, 2022 18:36 IST|Sakshi

మే 9.. రష్యా చరిత్రలో ఈ రోజు ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీలో నాజీలపై సోవియెట్‌ యూనియన్‌ విజయం సాధించిన రోజు. సోవియెట్‌ యూనియన్‌ అధినేత జోసెఫ్‌ స్టాలిన్‌ ముందు 1945 సంవత్సరం, మే9న నాజీలు లొంగిపోయిన రోజు. అయితే ఈ సారి రష్యా ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మే 9 చాలా ప్రత్యేకత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ దీనిపై స్పందిస్తూ ఓ వీడియోని విడుదల చేశారు.

అందులో.. చెడు మళ్లీ తిరిగి వచ్చిందని, కాకపోతే అది వేరే రూపంలో, వేర్వేరు నినాదాలతో వచ్చిందని, కానీ ప్రయోజనం మాత్రం అదేనని ఆయన అన్నారు. ఈ సారి ఉక్రెయిన్ దాని మిత్రదేశాలు ఇందులో గెలుస్తాయని చెప్పారు. మంచిపై చెడు ఎన్నడూ విజయం సాధించదన్నారు. కాగా నాజీ నాయకుడు అడాల్ఫ్ హిట్లర్ తన జీవితంలో చివరి రోజులు బెర్లిన్‌లోని బంకర్‌లో గడిపాడు. ఒకానొక దశలో యుద్ధంలో ఓడిపోతున్నాడని తెలిసి ఓటమిని అంగీకరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా జెలెన్సీ‍్క ఈ ఘటనలను ఉద్దేశ్యించి ప్రస్తుత పరిణామాలకు అనుసంధానించారు.

ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ ఆపరేషన్‌ ప్రకటించి సంగతి తెలిసిందే. ఈ చర్యల కారణంగా ఉక్రెయిన్‌లో వేలాది మంది పౌరులు, సైనికులు మరణించారు. అంతేకాక దాదాపు 10 మిలియన్ల మంది తమ సొంత ఇళ్లను వదిలి వలస పక్షులుగా మారారు. మే 9న పురస్కరించుకుని రష్యా తన మిలటరీ సత్తా ఏటా ప్రపంచానికి చాటి చెప్తుంది.

చదవండి: Russia-Ukraine war: రష్యా విక్టరీ డే: మే 9న ఏం జరగబోతోంది?

మరిన్ని వార్తలు