US Religious Freedom Panel Ex-Chief On Obama's India Remark - Sakshi
Sakshi News home page

భారత్‌ను పొగడాలే తప్పా.. విమర్శించకూడదు: ఒబామాకు సలహా

Published Mon, Jun 26 2023 4:04 PM

US Religious Freedom Panel Ex Chief Reacts Obama India Remark - Sakshi

న్యూయార్క్‌:  భారత ప్రధాని మోదీ అమెరికా పార్లమెంట్‌లో ప్రసంగించే టైంలో.. ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, మరో కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ.. ఇలా పలువురు ఒబామాపై మండిపడ్డారు.  ఈ క్రమంలో.. అమెరికాకే చెందిన ఓ మాజీ  ఉన్నతాధికారి ఒబామా వ్యాఖ్యలను తప్పుబట్టారు.

ఒబామా తన శక్తినంతా భారత్‌ను విమర్శించడానికి బదులు పొగడడానికి ఉపయోగించాలంటూ సూచించారు యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌(అంతర్జాతీయ మత స్వేచ్ఛా సంస్థ) మాజీ కమిషనర్‌ జానీ మూర్‌.  భారత్‌ను విమర్శించడం కంటే.. పొగడడం కోసం తన శాయశక్తులా ఆయన(ఒబామాను ఉద్దేశించి..) కృషి చేయడం మంచిదని నేను అనుకుంటున్నా. మానవ చరిత్రలోనే అత్యంత వైవిధ్యం ఉన్న దేశం భారత్‌. అది అమెరికాలాగా అది పరిపూర్ణ దేశం కాకపోవచ్చు. కానీ, భిన్నత్వం ఆ దేశానికి ఉన్న అతిపెద్ద బలం. అలాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని వీలైనప్పుడల్లా పొగడాలే తప్పా.. ఇలా విమర్శించకూడదు’’ అని ఒమామాకు సలహా ఇచ్చారు జానీ మూర్‌.

మోదీ అమెరికా పర్యటన చారిత్రాకమైందన్న ఆయన.. మిత్రదేశాల పట్ల ప్రజాసామ్య యుతంగానే ముందుకు వెళ్లాలని, సాధ్యమైనంత వరకు బహిరంగ విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారాయన.  

ప్రధాని మోదీ అమెరికాలో పర్యటిస్తున్న సమయంలోనే.. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఒబామా ఇంటర్వ్యూ ఇచ్చారు. భారత ప్రభుత్వం మైనారిటీల హక్కుల్ని కాపాడలేకపోతే..  ఎప్పటికైనా విడిపోయే ప్రమాదం ఉందంటూ ఆ ఇంటర్వ్యూలో ఒబామా అభిప్రాయపడ్డారు. అలాగే.. మోదీ-బైడెన్‌ చర్చల్లో మైనార్టీల హక్కుల పరిరక్షణ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలంటూ ఓ సలహా కూడా ఇచ్చారు. 

యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌ అనేది.. 1998 ఇంటర్నేషనల్‌ రెలిజియస్‌ ఫ్రీడమ్‌ యాక్ట్‌ ద్వారా అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి కమిషనర్‌లను అమెరికా ప్రెసిడెంట్‌తో పాటు సెనేట్‌, హౌజ్‌ ఆఫ్‌ రెప్రజెంటేటివ్స్‌ ఉభయ సభల్లోని లీడర్లు ఎన్నుకుంటారు. ఇక జానీ మూర్‌ గతంలో డొనాల్డ్‌ ట్రంప్‌కు ఆధ్యాత్మిక సలహాదారుగా పని చేశారు కూడా. 

ఇదీ చదవండి: ఆ విషయంలో అమెరికా కంటే ఆంధ్రానే మేలు

Advertisement

తప్పక చదవండి

Advertisement