USA Condemns North Korea Missile launch Threat International Community - Sakshi
Sakshi News home page

‘నీ అవ్వ తగ్గేదేలే’.. వారంలో రెండోసారి! కిమ్‌ తీరుపై అమెరికా ఫైర్‌

Published Wed, Jan 12 2022 9:34 AM

USA Condemns North Korea Missile launch Threat International Community - Sakshi

వాషింగ్టన్: ఉత్తర​ కొరియా నియంతాధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ దుందుడుకు చేష్టలపై అంతర్జాతీయ సమాజం మండిపడుతోంది. వారం వ్యవధిలో రెండోసారి  బాలిస్టిక్‌ క్షిపణి పరీక్షలను నిర్వహించడంపై అమెరికా తీవ్రంగా మండిపడింది. దీంతో తీవ్ర ఆహార సంక్షోభం నేపథ్యంలో మిస్సైల్‌ పరీక్షలపై కిమ్‌ వెనక్కి తగ్గాడన్న అంచనాలు మళ్లీ తప్పాయి.


కేవలం వారం వ్యధిలో రెండుసార్లు క్షిపణి పరీక్షలు నిర్వమించాడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌. స్వయంగా దగ్గరుండి మరీ పరీక్షించాడు. ఈ చర్యలు.. అంతర్జాతీయ సమాజానికి ముప్పుగా పరిణమించబోతున్నాయని పేర్కొంది. అదే సమయంలో దక్షిణ కొరియా, జపాన్‌ దేశాల రక్షణ కోసం తమ నిబద్ధతను చాటుకుంటామని అమెరికా పునరుద్ఘాటించింది. ఉత్తర కొరియా ఐక్యరాజ్య సమతి భద్రత మండలి నియమ, నిబంధనలు ఉల్లంఘించిదని అగ్రహం వ్యక్తం చేసింది. 

ప్రస్తుతం అమెరికా, ఉత్తర కొరియా మధ్య అణుచర్చలపై సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అణ్వాయుధ కార్యక్రమాన్ని విస్తరిస్తామని ఇప్పటికే తెగేసి చెప్పారు. వారం వ్యవధిలోనే ఉత్తర కొరియా రెండోసారి క్షిపణి పరీక్షలు నిర్వహించి దక్షిణ కొరియాకు సవాల్‌ విసిరింది. తూర్పు సముద్రంలో ఈ పరీక్షలు నిర్వహించడంతో జపాన్‌ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. తమ దేశ నౌకలు, విమానాలు ఏమైనా ధ్వంసమయ్యాయా అన్న దిశగా విచారణ జరుపుతోంది. అయితే దేశసంస్కరణల సంగతి ఎలా ఉన్నా.. రక్షణ విభాగంలో తగ్గేదేలే లేదని ప్రకటించుకుంది కిమ్‌ అధికార విభాగం.

చదవండి: మళ్లీ ఉత్తర కొరియా బాలిస్టిక్‌ క్షిపణి పరీక్ష 

Advertisement
Advertisement