Video: ఎయిర్‌పోర్టులో వీర లెవల్లో తన్నుకున్న ప్రయాణికులు..

24 May, 2023 18:10 IST|Sakshi

రోడ్డు మీద, గల్లీలో, బస్సు, రైళ్లలో కొందరు వ్యక్తులు కొట్టుకోవడం చాలానే చూశాం. ఇలాంటి సంఘటనలు తరుచూ జరుగుతూనే ఉంటాయి. వీటికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్‌గా మారుతుంటాయి. మరి కొత్తగా ప్రయత్నిద్దామనుకున్నారో ఏమో గానీ  ఏకంగా విమానాశ్రయంలో కొంతమంది ప్రయాణికులు గొడవపడ్డారు. ఒకరినొకరు వీర లెవల్లో తన్నుకున్నారు.  ఇది ఎక్కడో కాదు.. సెక్యూరిటీ అధికంగా ఉండే అమెరికాలో జరిగింది.

వివరాలు.. చికాగోలోని ఓ హేర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో సోమవారం భారీ పోరాటమే జరిగింది. విమానం దిగి వస్తుండగా మాటామాటా పెరిగి పెద్ద గొడవకు దారి తీసింది. విమానాశ్రయంలో బ్యాగేజ్‌ క్లెయిమ్‌ ప్రాంతంలో ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు చేయిచేసుకోవడంతో ఈ గొడవ ప్రారంభమైంది. టెర్మినట్ 3లో వద్ద జరిగిన ఈ ఘర్షణలో దాదాపు 12 మందికి పైగా  పాల్గొన్నారు.
చదవండి: రేయ్‌! మారం‍డ్రా.. హెల్మట్‌ ధరించి మరీ రైడ్‌ చేస్తున్న కుక్క

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో కొంతమంది వ్యక్తులు  బీభత్సంగా కొట్టుకోవడం, మహిళలు నేలపై పడుకొని ఒకరు జుట్టు ఒకరు లాక్కోవడం కనిపిస్తోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘వీరిని బాక్సింగ్‌ విభాగంలో పోటీలకు పంపితే గోల్డ్‌ మెడల్‌ సాధించడం పక్కా’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

కాగా తొలుత మహిళపై దాడిచేసిన ఇద్దరు వ్యక్తులను గుర్తించారు. వీరిని 18 ఏళ్ల క్రిస్టోఫర్ హాంప్టన్, 20 ఏళ్ల టెంబ్రా హిక్స్‌గా గుర్తించిన అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు.  మరోవైపు అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. ఈ ఘటన తర్వాత చికాగో ఎయిర్ పోర్టు ఓ ప్రకటనను విడుదల చేసింది. ప్రయాణికులు భద్రత, సౌకర్యం తమకు అత్యంత ముఖ్యమని వెల్లడించాయి.
చదవండి: 14 ఏళ్ల బాలిక ఘనత.. స్లమ్‌ నుంచి ల‌గ్జ‌రీ బ్యూటీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా..

మరిన్ని వార్తలు :


Advertisement

ASBL
మరిన్ని వార్తలు