41 ఏళ్లుగా అడవిలోనే.. స్త్రీలంటే ఎవరో తెలియదు

28 Jun, 2021 10:41 IST|Sakshi

నెట్టింట వైరలవుతోన్న రియల్‌ లైఫ్‌ టార్జన్‌ స్టోరి

హనోయి/వియాత్నం: కరోనా కారణంగా మనం కొద్ది రోజులపాటు ఇంటికి పరిమితం కావడానికి చాలా కష్టపడ్డం. చుట్టూ మనవారు నలుగరు ఉన్నప్పటికి.. బందీలుగా ఫీలయ్యాం. అలాంటిది ఓ వ్యక్తి దాదాపు 41 ఏళ్లుగా నాగరిక సమాజానికి దూరంగా అడవిలోనే ఉంటూ.. అక్కడ దొరికేవి తింటూ.. బతికాడు. ఊహ తెలిసిన నాటి నుంచి కేవలం అన్న, తండ్రిని మాత్రమే చూడటంతో అసలు లోకంలో ఆడవారు ఉంటారనే విషయమే అతడికి తెలియదు. ఇక వారిలో శృంగార వాంఛలు అసలు లేనేలేవు అంటే తప్పక ఆశ్చర్యం కలుగుతుంది. ప్రస్తుతం ఈ రియల్‌ టార్జాన్‌ లైఫ్‌ స్టోరీ నెట్టింటో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. 

వియాత్నంకు చెందిన హో వాన్‌ లాంగ్‌ చాలా చిన్నతనంలో అతడవిలోకి వెళ్లాడు. 1972నాటి వియాత్నం యుద్ధం వల్ల అతడి జీవితం ఇలా మారిపోయింది. ఈ యుద్ధంలో అతడి తల్లి, ఇద్దరు తోబుట్టువులు మరణించారు. హో వాన్‌ లాంగ్‌, అతడి తండ్రి, సోదరుడు మాత్రం యుద్ధ సమయంలో తప్పించుకుని అడవిలోకి వెళ్లారు. మనిషి కనిపించిన ప్రతి సారి వారు అడవిలో మరింత లోపలికి పయనం చేశారు. అలా నాగరిక సమాజానికి పూర్తిగా దూరం అయ్యారు. అక్కడే జీవిస్తూ.. అడవిలో దొరికే పండ్లు, తేనే, చిన్న చిన్న జంతువులను వేటాడి తింటూ కాలం గడిపారు. ఈ నలభై ఏళ్లలో ఈ ముగ్గురు తండ్రికొడుకులు కేవలం ఐదుగురు మానవులను మాత్రమే చూశారు.

ఎలా వెలుగులోకి వచ్చారంటే.. 
ఇలా అడవిలో జీవనం సాగిస్తున్న వీరిని 2015లో అల్వారో సెరెజో అనే ఫోటోగ్రాఫర్‌ గుర్తించి.. అడవి నుంచి వారిని బయటకు తీసుకువచ్చాడు. అక్కడే సమీపంలో ఉన్న ఓ గ్రామంలో వారిని ఉంచాడు. ఈ సందర్భంగా అల్వారో మాట్లాడుతూ.. ‘‘మనుషులను చూసిన ప్రతి సారి వీరు అడవిలో మరింత దూరం వెళ్లేవారు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటేంటే వీరికి లోకంలో స్త్రీలు ఉంటారని తెలియదు. ఇప్పుడిప్పుడే వారిని గుర్తించగలుగుతున్నారు. కానీ నేటికి స్త్రీ, పురుషుల మధ్య తేడా ఏంటో వీరికి తెలియదు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే వీరిలో శృంగారవాంఛలు అసలు లేవు. ఇక హోవాన్‌ లాంగ్‌ తండ్రి నేటికి కూడా వియాత్నం యుద్ధం ముగియలేదు అనుకుంటున్నాడు’’ అన్నాడు.

మంచి, చెడు తేడా తెలియదు..
‘‘హో వాన్‌ లాంగ్‌కు మంచి, చెడు తేడా తెలియదు. వేటాడటంలో దిట్టం. ఎవరినైనా కొట్టమంటే.. చచ్చేవరకు కొడతాడు. చంపమని ఆదేశిస్తే.. వెంటాడి వేటాడుతాడు. తప్ప మంచి, చెడు తెలియదు. ఎందుకంటే అతడి ఏళ్లుగా అడవిలో ఉండటం వల్ల హోవాన్‌ లాంగ్‌ మెదడు చిన్న పిల్లల మాదిరిగానే ఉంటుంది. ఇప్పుడిప్పిడే హో వాన్‌ లాంగ్‌ నాగరిక జీవితానికి అలవాటు పడుతున్నాడు. తొలి ఏడాది వీరిని పలు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఇక్కడి వాతావరణంలో ఉండే బాక్టీరియా, వైరస్‌ల దాడికి తట్టుకోలేకపోయారు. ఇక్కడి రణగొణ ధ్వనులు వీరికి నచ్చడం లేదు. కాకపోతే జంతువులు మనుషులతో స్నేహంగా ఉండటం వారిని ఆశ్చర్యానకి గురి చేస్తుంది’’ అన్నాడు అల్వారో. 

చదవండి: 16 ఏళ్లుగా భార్య శవంతో బెడ్‌పై...

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు