వీడియో: శభాష్‌.. ఆమె పూర్వానుభవం.. ఒక ప్రాణం నిలిపింది

15 Oct, 2022 13:05 IST|Sakshi

వైరల్‌: ఆపదలో ఉన్న వ్యక్తుల్ని ఆదుకోవడం నిజంగా గొప్ప విషయం. కేవలం మానవ సంబంధాలతో సాయం చేసేవాళ్లను చూస్తే అభినందించకుండా ఉండలేం. అయితే.. ముప్పును అంచనా వేసి సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలు నిలబెట్టడం మరింత విశేషమే కదా. అలాంటి ఘటనే ఇది.. 

గుడ్‌ న్యూస్‌ మూమెంట్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ తాజాగా ఓ వీడియోను షేర్‌ చేసింది. ఆ వీడియోలో..  ఒక ఫ్యామిలీ ఓ రెస్టారెంట్‌లో తింటూ ఉంటారు. అందులో ఓ వ్యక్తికి గొంతులో ఏదో అడ్డం పడి.. ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా మారుతుంది. అది గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని ఏం జరిగిందంటూ ఆరా తీసే యత్నం చేస్తారు. అంతలో ఓ వెయిట్రెస్‌ అక్కడి రావడంతో.. ఆమెకు అతని పరిస్థితిని వివరిస్తారు. ఇంక.. 

క్షణం ఆలస్యం కూడా చేయకుండా ఆమె అతనికి యాంటీ చోక్‌ ట్రీట్‌మెంట్‌ ఇస్తుంది. దీనినే హిమ్లిచ్‌ మనువహ్‌(heimlich maneuver) అంటారు. గొంతుకు ఏదైనా అడ్డం పడి.. శ్వాసకు ఇబ్బంది ఏర్పడిన తరుణంలో ఈ తరహా చికిత్స అందిస్తారు. తద్వారా అడ్డం పడ్డ వస్తువు బయటకు రావడం లేదంటే లోపలికి వెళ్లిపోవడం ద్వారా ఆ వ్యక్తికి ఉపశమనం కలిగి.. సాధారణ స్థితికి వచ్చాడు. ఎక్కడ జరిగిందో తెలియదుగానీ.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ కావడంతో ఆమెను షీ(హీ)రోగా అభివర్ణిస్తున్నారంతా.

A post shared by Good News Movement (@goodnews_movement)

కస్టమర్‌ను కాపాడిన ఆ వెయిట్రెస్‌ పేరు లేసీ గప్టిల్‌ అని.. ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌గా గతంలో పని చేసిన ఆమె సీపీఆర్‌తో పాటు హిమ్లిచ్‌ మనువర్‌లోనూ శిక్షణ తీసుకుందని తెలుస్తోంది. 

అమెరికన్ డాక్టర్‌ హెన్రీ హీమ్లిచ్ ఈ విధానానికి సృష్టికర్త కాగా.. ఆ పేరు మీదుగా ఈ అత్యవసర చికిత్సకు పేరొచ్చింది.

గొంతులో ఏదైనా అడ్డం పడినప్పుడు.. ఉక్కిరిబిక్కిరి అయిన బాధితుడు ఊపిరి పీల్చుకోలేని స్థితిలో సాధారణంగా మాట్లాడలేడు. గొంతుపై రెండు చేతులను ఉంచి. సాయం కోసం వేడుకుంటాడు. అలాంటప్పుడు ఈ చికిత్సను చాలా జాగ్రత్తగా అందించాల్సి ఉంటుంది.
 

మరిన్ని వార్తలు