వైరల్‌ వీడియో: రంగులు మార్చే ఊసరవెల్లి తెలుసు..కానీ పక్షిని చూశారా!

23 Jul, 2022 17:46 IST|Sakshi

పరిసరాలకు అనుగుణంగా ఊసరవెల్లి రంగులు మార్చగలదని మనందరికీ తెలిసిందే. మరి ఓ పిట్ట రంగులు మార్చడాన్ని మీరెప్పుడైనా చూశారా? తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి చేతిపై వాలిన అన్నాస్‌ హమ్మింగ్‌ బర్డ్‌ అటూ ఇటూ తల తిప్పినప్పుడల్లా ముదురు ఆకుపచ్చ నుంచి నలుపు వరకు వివిధ రంగులను మార్చడం నెటిజన్లను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది.

ఈ పిట్టల ఈకల్లో ప్యాన్‌ కేక్‌ ఆకృతిలో ఉండే పిగ్మెంట్లే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హమ్మింగ్‌ బర్డ్‌ తల తిప్పినప్పుడల్లా ఈ పిగ్మెంట్లు కాంతికిరణాలను మళ్లించడం వల్ల అది రంగులు మారుస్తున్నట్లుగా మనకు అనిపిస్తుందని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు